Tollywood: అవకాశం కావాలంటే దర్శకుడితో ఒక్కరాత్రి గడపాలి అన్నారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
ఇప్పుడిప్పుడే సినీరంగంలో నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస ఆఫర్స్ అందుకుంటుంది. కానీ కెరీర్ తొలినాళ్లలో ఎన్నో తిరస్కరణలను ఎదుర్కొంది. అంతేకాదు.. దర్శకనిర్మాతలతో కాస్టింగ్ కౌచ్ పరిస్థితులను ఎదుర్కొంది.

కాస్టింగ్ కౌచ్.. సినీరంగాన్ని పట్టిపీడిస్తోన్న సమస్య. ఇప్పటికే ఎంతో మంది తారుల ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను..కఠిన పరిస్థితుల గురించి బహిరంగంగా మాట్లాడారు. ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా సినిమాల్లో తొలి అవకాశం కోసం ఎదురుచూస్తున్న చాలా మంది అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ పరిస్థితులను ఎదుర్కొన్నవారే. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్, నటీమణులు తమకు ఎదురైన పరిస్థితుల గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. మరికొందరు మౌనంగానే సినీరంగం నుంచి తప్పుకున్నారు. అంతేకాకుండ భవిష్యత్తులో అవకాశాలు కోల్పోతామేమో అనే భయంతో మౌనంగా ఉండే ప్రతిభావంతులైన నటుల కథలు ఇప్పటికీ తెరవెనుక ఉన్నాయి. తాజాగా ఓ హీరోయిన్ మాత్రం కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ధైర్యంగా బయటపెట్టింది. తన సినీరంగ ప్రవేశం అంత అందంగా జరగలేదని చెప్పుకొచ్చింది ఈ 22 ఏళ్ల నటి. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ కాశీకా కపూర్.
కాశిక 2024లో ‘ఆయుష్మతి గీత మెట్రిక్ పాస్’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ప్రతిభతోనే కాకుండా, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో కూడా ప్రేక్షకులను కట్టిపడేంది. అయితే 150 ఆడిషన్లలో తనకు రిజెక్ట్ చేశారని…ఆ తర్వాతే తనకు ఫస్ట్ మూవీ ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చింది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని బయటపెట్టింది. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో తనకు ఓ దర్శకుడిని నుంచి తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ వచ్చిందని.. “నీకు అవకాశం కావాలంటే నాతో ఒక రాత్రి గడపాలి” అంటూ అతడు కండీషన్ పెట్టాడని తెలిపింది. వెంటనే తను అందుకు నిరాకరించానని.. కొన్నేళ్ల తర్వాత తనను తను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఎలాంటి అపరాధ భావన కలగకూడదని అనుకున్నానని తెలిపింది.
కాస్టింగ్ డైరెక్ట్రస్ అర్దరాత్రిళ్లు ఫోన్ చేస్తూ యాక్టింగ్, సినిమా గురించి కాకుండా అసభ్యకరమైన ఆఫర్స్ ఇస్తారు.. వీళ్లు ఎలాంటి వాళ్లు ? ఆ తర్వాత అంతా మాములే అన్నట్లుగా మాట్లాడతారు.. కష్ట సమయంలో తనకు తన తల్లి నుంచి గొప్ప మద్దతు లభించిందని చెప్పుకొచ్చింది. తన తల్లి వల్లే ఈరోజుకు ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని తెలిపింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :