Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‌లోకి.. పరుగు మూవీ హీరోయిన్ను ఇప్పుడే చూస్తే షాకే..
తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాలతో పాపులర్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి ఆ తర్వాత ఆకస్మాత్తుగా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. అల్లు అర్జున్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు. అందులో కొందరు తారలు మాత్రమే తక్కువ సమయంలో క్రేజ్ సొంతం చేసుకుంటారు. తెలుగులో యంగ్ హీరోస్ సరసన ఛాన్స్ కొట్టేసి తక్కువ సినిమాలు చేసినప్పటికీ అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో షీలా కౌర్ ఒకరు. ఈ బ్యూటీ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పరుగు మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 20 సినిమాల్లో కనిపించింది. టాలీవుడ్ హీరో నవదీప్ నటించిన సీతాకోక చిలుక సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది.
ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్ పోతినేని సరసన మస్కా సినిమాలో మెరిసింది. ఇక అల్లు అర్జున్ నటించిన పరుగు చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో అమాయకంగా కనిపిస్తూనే తనదైన నటనతో, అందంతో కుర్రకారులను ఆకర్షించింది. ఆ తర్వాత తెలుగులో రాజు భాయ్, హలో ప్రేమిస్తారా, అదుర్స్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్న షీలాకు నెమ్మదిగా ఆఫర్స్ తగ్గిపోయాయి.
ఆమె చివరిసారిగా 2011లో బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర సినిమాలో నటించింది. ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు. 2020లో ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక పాప జన్మించింది. ప్రస్తుతం తన భర్తతో కలిసి సూపర్ మార్కెట్ బిజినెస్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ షీలా చాలా యాక్టివ్. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..