AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటెంట్‌ క్రియేటర్లకు క్రేజీ న్యూస్‌..! యూట్యూబ్‌లో సరికొత్త AI ఫీచర్‌!

యూట్యూబ్ షార్ట్స్ కోసం కొత్త AI రీమిక్స్ ఫీచర్లను యూట్యూబ్ టెస్ట్ చేస్తోంది. క్రియేటర్లు తక్కువ సమయంలోనే ఆకర్షణీయమైన షార్ట్ వీడియోలు రూపొందించుకునేలా ఇవి సహాయపడతాయి. Add Object, Reimagine వంటి టూల్స్‌తో AI సాయంతో వీడియో ఎడిటింగ్ మరింత సులువు అవుతుంది.

కంటెంట్‌ క్రియేటర్లకు క్రేజీ న్యూస్‌..! యూట్యూబ్‌లో సరికొత్త AI ఫీచర్‌!
Youtube Shorts Ai
SN Pasha
|

Updated on: Mar 02, 2026 | 3:07 PM

Share

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ తన షార్ట్ వీడియో సర్వీస్‌ YouTube Shorts కోసం కొత్త AI రీమిక్స్ ఫీచర్‌ను టెస్టింగ్‌ స్టేజ్‌లో రిలీజ్‌ చేసింది. ఈ ఫీచర్‌తో కంటెంట్ క్రియేటర్లు ఇప్పటికే ఉన్న వీడియోల నుంచి కొత్త షార్ట్ వీడియోలను వేగంగా రూపొందించుకోవచ్చు. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్ మాట్లాడే కొంతమంది క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ అప్డేట్‌లో ప్రధాన లక్ష్యం ఎడిటింగ్‌ను సులభతరం చేయడం, ట్రెండింగ్ కంటెంట్‌ను వేగంగా సృష్టించేలా చేయడం, యాప్‌ను వదిలి బయట సాఫ్ట్‌వేర్ అవసరం లేకుండా, AI సహాయంతోనే వీడియోలను మార్చుకునే అవకాశం కల్పిస్తోంది.

Add Object టూల్

కొత్త ఫీచర్లలో మొదటిది Add Object. ఈ టూల్ ద్వారా క్రియేటర్లు AI రూపొందించిన అంశాలను తమ షార్ట్ వీడియో క్లిప్‌లోకి యాడ్‌ చేయొచ్చు. ఇది ముఖ్యంగా 8 సెకన్ల వీడియోలపై పనిచేస్తుంది. వినియోగదారులు కేవలం ప్రాంప్ట్ టైప్ చేస్తే సరిపోతుంది. మిగతా పని AI స్వయంగా పూర్తి చేస్తుంది. దీంతో క్లిష్టమైన ఎడిటింగ్ అవసరం తగ్గిపోతుంది.

Reimagine టూల్ ప్రత్యేకత

మరో కీలక టూల్ Reimagine. ఇది ఒక చిన్న వీడియోలోని ఒక్క ఫ్రేమ్‌ను తీసుకుని పూర్తిగా కొత్త AI వీడియోగా మార్చుతుంది. వినియోగదారులు ప్రాంప్ట్‌లతో పాటు రెండు రిఫరెన్స్ ఫోటోలు ఇవ్వడం ద్వారా వీడియో రూపాన్ని తమకు నచ్చినట్టు రూపొందించుకోవచ్చు. అంటే, ఒక సాధారణ క్షణాన్ని పూర్తిగా భిన్నమైన సృజనాత్మక వీడియోగా మార్చే శక్తి ఈ టూల్‌కు ఉంది.

క్రెడిట్, నియంత్రణ

AI రీమిక్స్‌లపై పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు యూట్యూబ్ తెలిపింది. ప్రతి AI రీమిక్స్ అసలు షార్ట్ వీడియోకు లింక్ అవుతుంది, దీంతో మూల క్రియేటర్‌కు క్రెడిట్ లభిస్తుంది. తమ వీడియోలు AI రీమిక్స్‌లో ఉపయోగించకూడదనుకునే క్రియేటర్లు ఆ ఎంపికను ఆఫ్ చేసుకునే వీలుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర