AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramam : పాన్ ఇండియా మూవీగా రామం.. శ్రీరామ నవమి కానుకగా టైటిల్ పోస్టర్ రిలీజ్..

టాలీవుడ్ యంగ్ హీరో ప్రధాన పాత్రలో రామం అనే సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు ప్రముఖ చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడి. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.

Ramam : పాన్ ఇండియా మూవీగా రామం.. శ్రీరామ నవమి కానుకగా టైటిల్ పోస్టర్ రిలీజ్..
Ramam
Rajitha Chanti
|

Updated on: Apr 06, 2025 | 12:53 PM

Share

శ్రీరామనవమి సందర్భంగా చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడి.. ‘రామం’ అనే పాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుట్టారు. ‘ది రైజ్ ఆఫ్ అకిరా’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ధర్మ సంస్థాపనకు యుద్ధం చేసిన రాముడి అడుగు జాడల్లో నడుస్తూ .. ఆయన చూపిన బాట ప్రపంచానికి ఆదర్శం అని చాటి చెప్పే వీరుడుకి సంబంధించి, ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఓ గొప్ప యోధుడికి సంబంధించిన కథాంశంతో రూపొందుతోన్న సినిమా ఇది.

ఇండస్ట్రీలో పలువురి దర్శకుల దగ్గర పని చేసిన లోక‌మాన్య‌ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు వేణు దోనేపూడి. భారీ బడ్జెట్‌, అంత‌ర్జాతీయ విలువ‌ల‌తో పాన్ ఇండియా మూవీగా ‘రామం’ సినిమాను రూపొందిస్తున్నారు. భారతీయులకు పర్వదినమైన శ్రీరామనవమి సందర్భంగా ‘రామం’ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘‘సమస్త మానవాళికి తారక మంత్రం శ్రీరామనామం. ధర్మ సంస్థాపనకు శ్రీరామచంద్రుడు చూపిన బాటే కాదు.. అధర్మం నిర్మూలించటానికి ఆయన కోదండం చేపట్టి చూపిన వీరత్వం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. అలాంటి గొప్ప సమగ్ర మూర్తిమత్వాన్ని ఆధారంగా చేసుకుని.. నేటి కాలంలో అలనాటి రామరాజ్యాన్ని కనెక్ట్ చేస్తూ ఇప్పటి వరకు రానటువంటి వైవిధ్యమైన కథతో ‘రామం’ సినిమా మీ ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వర‌లోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది. అన్‌కాంప్రమైజ్డ్‌గా, అత్యుత్తమ ప్రమాణాలతో, అంతర్జాతీయ సాంకేతిక విలువలతో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించ‌నున్న ఈ చిత్రంలో టాలీవుడ్‌కి చెందిన ఓ రైజింగ్ స్టార్ హీరోగా నటిస్తున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా అగ్ర నటీనటులు,సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేయనున్నారు. ఆ వివరాలను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..