AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏమున్నాడ్రా బాబూ.. దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరో.. ఫాలోయింగ్ ఎక్కువే..

సినీరంగంలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన చిన్నారులు ఇప్పుడు వెండితెరను ఏలేస్తున్నారు. అప్పట్లో బాలనటీనటులుగా కనిపించిన తారలు.. హీరోహీరోయిన్లుగా వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు. అందులో ఈ చిన్నోడు ఒకరు. దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు హీరో కటౌట్ తో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.

Tollywood: ఏమున్నాడ్రా బాబూ.. దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరో.. ఫాలోయింగ్ ఎక్కువే..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 03, 2025 | 2:23 PM

తెలుగు సినీపరిశ్రమలోని ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ చిత్రాల్లో దేవి ఒకటి. సీనియర్ హీరో భానుచందర్, వనీత విజయ్ కుమార్, ప్రేమ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ చిత్రంలోని పాటలు ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ సినిమాలో అమాయకంగా కనిపిస్తూనే భయపెట్టిన కుర్రాడు గుర్తున్నాడా.. ? దేవి సినిమాతో తెలుగులో చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత మోహన్ బాబు నటించిన పెదరాయుడు సినిమాలోనూ కనిపించాడు. అలాగే తమిళంలో అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించి మెప్పించాుడ. ఆ కుర్రాడి పేరు మహేంద్రన్. తెలుగులో జగపతి బాబు నటించిన ఆహా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

ఆ తర్వాత 1994లో కోలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించాడు. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తెలుగులో ఆహా, దేవి, పెళ్లి చేసుకుందాం, నీ స్నేహం, లిటిల్ హార్ట్స్ వంటి సినిమాల్లో నటించాడు. దేవి సినిమాకు ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డ్ అందుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 130 సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉండిపోయాడు.

ఇక ఇప్పుడు హీరోగా కోలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నాడు. హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటున్నాడు. మాస్టర్ సినిమాలో యంగ్ భవాని పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత రిప్ అప్ బరీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇటీవలే లేబుల్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పటివరకు కేవలం తమిళంలోనే సినిమాలు చేస్తున్న మహేంద్రన్ తెలుగులోకి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. అయితే సోషల్ మీడియాలో మహేంద్రన్ చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా మహేంద్రన్ న్యూలుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..