AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda House: సొంతూరిలో విజయ్ దేవరకొండ ఇళ్లు చూశారా.. ఇంద్రభవనం కూడా తక్కువే..!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. భార్యాభర్తలుగా తమ కొత్త ప్రయాణాన్ని అత్యంత స్వచ్ఛంగా ప్రారంభించారు. డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత ఈ క్రేజీ జోడీ నేరుగా నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని తుమ్మన్ పేట గ్రామానికి చేరుకుంది. పెళ్లయ్యాక రష్మికను తొలిసారిగా తన సొంతూరికి తీసుకొచ్చిన రౌడీ బాయ్.. అక్కడున్న తన ఫామ్ హౌస్‌లో ఈరోజు అత్యంత భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.

Vijay Devarakonda House: సొంతూరిలో విజయ్ దేవరకొండ ఇళ్లు చూశారా.. ఇంద్రభవనం కూడా తక్కువే..!
Vijay Deverakonda New House
Praveen Vadla
| Edited By: |

Updated on: Mar 02, 2026 | 4:54 PM

Share

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సొంతూరులో ఉన్న ఇళ్లు చూసాక సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది ఆ వీడియో..! ఉదయ్‌పూర్ వేదికగా అంగరంగ వైభవంగా పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. భార్యాభర్తలుగా తమ కొత్త ప్రయాణాన్ని అత్యంత స్వచ్ఛంగా ప్రారంభించారు. డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత ఈ క్రేజీ జోడీ నేరుగా నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని తుమ్మన్ పేట గ్రామానికి చేరుకుంది. పెళ్లయ్యాక రష్మికను తొలిసారిగా తన సొంతూరికి తీసుకొచ్చిన రౌడీ బాయ్.. అక్కడున్న తన ఫామ్ హౌస్‌లో ఈరోజు అత్యంత భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. తమ అభిమాన హీరో, కొత్త పెళ్లికూతురిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల జనాలు, ఫ్యాన్స్ భారీ సంఖ్యలో అక్కడికి క్యూ కట్టారు.

పాన్ ఇండియా లెవెల్లో స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ విజయ్ తన మూలాలను ఎన్నడూ మర్చిపోలేదు. తాను పుట్టి పెరిగిన తుమ్మనపేట అంటే ఆయనకు ప్రాణం. అందుకే జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి తర్వాత జరిగే తొలి పూజా కార్యక్రమాలను హైదరాబాద్ లాంటి మహానగరంలో కాకుండా, తన మట్టిపైనే, తన ఊరి ప్రజల మధ్యే జరుపుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఈ వ్రతానికి ఆయన చిన్ననాటి స్నేహితులు, అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నెటిజన్లు ముద్దుగా పిలుచుకునే ‘విరోష్’ జంట ట్రెడిషనల్ లుక్స్‌లో అదరగొడుతున్నారు. తమ పెళ్లి వేడుకల ప్లానింగ్‌ను అభిమానులకు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేసుకున్న ఈ జంట.. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్‌కు స్వీట్ బాక్సులు పంపి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

దేశం నలుమూలల నుంచి అభిమానుల ఆశీస్సులు అందుకున్న ఈ జంట.. ఇప్పుడు సొంత ఊరిలో పెద్దల దీవెనలు తీసుకోవడం అందరి మనసులను గెలుచుకుంటోంది. సత్యనారాయణ స్వామి వ్రతం కోసం తుమ్మన్ పేటలోని విజయ్ ఫామ్ హౌస్‌ను అచ్చమైన పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా సంప్రదాయబద్ధంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమం కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా ప్రైవేట్‌గా జరిగినప్పటికీ.. బయట మాత్రం వాతావరణం పండుగలా మారిపోయింది. విజయ్, రష్మికలను ఒక్కసారైనా చూడాలని ఫ్యాన్స్ పోటెత్తడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని కంట్రోల్ చేశారు. ముఖ్యంగా ఆయన ఫామ్ హౌజ్ మూడు అంతస్థులతో మామూలుగా లేదు. డ్రోన్ షాట్స్‌లో చూస్తుంటే ఇంద్రభవనం కూడా తక్కువే అనిపిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

కొన్ని ఏకరాలలో ఈ ఫామ్ హౌజ్ ఉంది. చుట్టూ పచ్చటి పంటపొలాల మధ్య అదిరిపోయేలా ఈ ఇంటిని ముస్తాబు చేసారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోనూ విజయ్ దేవరకొండకు అద్భుతమైన ఇళ్లు ఉంది. కానీ సొంతూరులో ఉన్న ఫామ్ హౌజ్ మాత్రం అత్యద్భుతంగా ఉంది. సొంతూరిలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు ముగించుకున్న ఈ జంట.. నెక్స్ట్ ఫోకస్ అంతా హైదరాబాద్‌లో జరగబోయే గ్రాండ్ రిసెప్షన్ పైనే పెట్టారు. మార్చి 4న భాగ్యనగరంలో అట్టహాసంగా జరగనున్న ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి అగ్ర హీరోలు, దర్శకులతో పాటు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నారు. మొత్తానికి ఉదయ్‌పూర్ వెడ్డింగ్, తుమ్మన్ పేటలో సత్యనారాయణ వ్రతం, ఇప్పుడు హైదరాబాద్‌లో రిసెప్షన్.. ఇలా విజయ్, రష్మికల పెళ్లి సందడి ఎక్కడా తగ్గకుండా ఓ రేంజ్‌లో సాగుతోంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర