AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

"ఎర్ర ఎర్ర రుమాలు" పాటతో సోషల్ మీడియాలో అనూహ్యంగా వైరల్ అయ్యింది ఫోక్ సింగర్ మల్లమ్మ. కానీ ఆమె జీవితం, వెండితెరపై కనిపించే మెరుపులకు భిన్నంగా కష్టాల మలుపులతో నిండి ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకుంటూ, కన్నీటి పర్యంతమయ్యారు. ఫోక్ సింగర్ జీవితంలో ఎదురయ్యే చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు.

Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..
Singer Mallamma
Rajitha Chanti
|

Updated on: Feb 27, 2026 | 11:30 AM

Share

“ఎర్ర ఎర్ర రుమాలు” పాటతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది ఫోక్ సింగర్ మల్లమ్మ. తన గాత్రంతో కుర్రకారును ఊర్రూతలూగించిన ఆమె జీవితం అంత సాఫిగా సాగలేదు. చదువులేని మల్లమ్మ తన భర్తను కోల్పోయి, ముగ్గురు పిల్లలను పోషిస్తూ వ్యవసాయ కూలీగా జీవిస్తోంది. పాటల పట్ల అపారమైన ప్రేమ, ప్రతిభ ఉన్నప్పటికీ, అవకాశాల కోసం ఆమె పడుతున్న కష్టాలు, ఎదుర్కొంటున్న మోసాలను వివరించారు. మహబూబ్‌నగర్‌కు నాలుగు గంటల దూరంలో ఉన్న హౌస్ లోన్ పల్లికి చెందిన మల్లమ్మ, అపరేటి పల్లిలో వివాహమై, ముగ్గురు పిల్లలకు తల్లి. ఎనిమిది సంవత్సరాల క్రితం, చార్నార్‌లో విద్యుదాఘాతంతో తన భర్తను కోల్పోయింది. అప్పటి నుండి, ఎనిమిది నెలల పాప, ఆరు సంవత్సరాల కూతురు, నాలుగు సంవత్సరాల కొడుకుతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఆమె ఇంటికి ఆధారంగా, రోజుకు 200-300 రూపాయలు సంపాదించుకుంటూ పొలం పనులు చేస్తోంది. సొంత ఇల్లు లేక తల్లిదండ్రుల ఇంట్లోనే నివసిస్తోంది. తన పెద్ద కూతురిని మహబూబ్‌నగర్ సమీపంలోని ఒక హాస్టల్‌లో చదివిస్తున్నట్లు తెలిపింది.

మల్లమ్మకు చిన్నతనం నుంచే పాటల పట్ల ఆసక్తి. చదువు రాని కారణంగా, ఆమె తన తల్లి దగ్గర పాటలు నేర్చుకుంది. పాటలోని పదాలను తన తల్లి చెప్పగా విని, గుర్తుంచుకుని పాడుతున్నాని తెలిపింది. “ఎర్ర ఎర్ర రుమాలు” పాట వైరల్ అయినప్పటికీ, ఆమె ప్రయాణం సాఫీగా సాగలేదు. మొదట రాజేంద్ర (రాజు అన్న) అవకాశం ఇచ్చినా, ఆ పాటను పక్కన పెట్టారు. తరువాత సంధ్య అనే గ్రామస్థురాలి సహాయంతో రాజు అన్నతో బండి మీద నువ్వు రాంగా సాయిలన్న పాట పాడారు. ఈ పాటనే ఆమెను ముందుగా ప్రజలకు పరిచయం చేసింది. “ఎర్ర ఎర్ర రుమాలు” కూడా అదే సమయంలో రికార్డు చేయబడినప్పటికీ, అది తరువాత వైరల్ అయ్యింది.

ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నానని, కొన్నిసార్లు తన మాటలను ప్రజలు జోక్‌గా తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పాటలను కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారని, డబ్బులు ఇస్తామని చెప్పి పాటలు తీసుకుని, తరువాత ఫోన్లు తీయడం లేదని, తన అనుమతి లేకుండా తన పాటలను తమ ఛానెల్స్‌లో రిలీజ్ చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నాకు తెలియకుండానే పదిహేను పాటలు బయటికి వచ్చేసాయి, అవి నావి అని ఎవరికీ తెలియదు” అని వాపోయారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Follow Us
ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. దానం నాగేందర్ బిగ్ బాంబ్!
ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. దానం నాగేందర్ బిగ్ బాంబ్!
వందే భారత్ వర్సెస్ శతాబ్ది.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఇవే!
వందే భారత్ వర్సెస్ శతాబ్ది.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఇవే!
బస్సు దిగుతుండగా రోహిత్‌కు ఊహించని ప్రమాదం.. కోహ్లీ ఏం చేశాడంటే.?
బస్సు దిగుతుండగా రోహిత్‌కు ఊహించని ప్రమాదం.. కోహ్లీ ఏం చేశాడంటే.?
UPI రూ.6,000 చెల్లింపును.. రూ.2 చొప్పున 3 సార్లు చేస్తే ఏమవుద్దీ
UPI రూ.6,000 చెల్లింపును.. రూ.2 చొప్పున 3 సార్లు చేస్తే ఏమవుద్దీ
ఇరాన్‌ శాంతి ప్రణాళికను తిప్పి పంపిన ట్రంప్‌ హర్మూజ్‌ కాదు..
ఇరాన్‌ శాంతి ప్రణాళికను తిప్పి పంపిన ట్రంప్‌ హర్మూజ్‌ కాదు..
స్కూళ్ల చుట్టూ జంక్‌ ఫుడ్‌ బ్యాన్‌?
స్కూళ్ల చుట్టూ జంక్‌ ఫుడ్‌ బ్యాన్‌?
ఫుల్లుగా విటమిన్లు, మినరల్స్.. కంటికి, గుండెకు దివ్యాస్త్రం..
ఫుల్లుగా విటమిన్లు, మినరల్స్.. కంటికి, గుండెకు దివ్యాస్త్రం..
ఫుట్‌బ్రిడ్జ్‌పై స్కూటీ చూసి జనం షాక్.. కొత్త షార్ట్‌కట్..?
ఫుట్‌బ్రిడ్జ్‌పై స్కూటీ చూసి జనం షాక్.. కొత్త షార్ట్‌కట్..?
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్, పాక్
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్, పాక్
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?