Premium Petrol: ప్రీమియం పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతున్నారా? కేంద్రం కీలక ప్రకటన..!
Premium Petrol: ఇథనాల్ రహిత ప్రీమియం పెట్రోల్ కొనసాగుతుండటం హై పెర్ఫార్మెన్స్ వాహనాల యజమానులకు సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. అదే సమయంలో E20 విధానాన్ని కొనసాగిస్తూ, ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా..

Premium Petrol: దేశంలోని మూడు ప్రధాన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తమ తమ ప్రీమియం ఇంధన బ్రాండ్లను విక్రయిస్తున్నాయి. అందులో IOC విక్రయించే XP100, HPCL అందించే Power100 & BPCL మార్కెట్లో విక్రయించే Speed100 పెట్రోలు పూర్తిగా ఇథనాల్ లేకుండానే సరఫరా అవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. అధిక ఆక్టేన్ విలువ కలిగిన ఈ ఇంధనాలను ప్రధానంగా హై పెర్ఫార్మెన్స్ కార్లు, సూపర్‌బైక్‌లు, ప్రీమియం వాహనాల కోసం రూపొందించారు.
అయితే దేశంలో ఈ ప్రీమియం పెట్రోలు వినియోగం చాలా పరిమితంగానే ఉందని ప్రభుత్వం తెలిపింది. మొత్తం పెట్రోల్ విక్రయాల్లో ఈ ప్రీమియం గ్రేడ్‌ల వాటా కేవలం 0.5 శాతం మాత్రమేనని వివరించింది. అంటే ఎక్కువ మంది వాహనదారులు సాధారణ E20 పెట్రోల్‌ను వినియోగిస్తుండగా, అతి కొద్ది మంది మాత్రమే ఈ ప్రీమియం ఇంధనాన్ని ఎంచుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Petrol Price: లీటర్ పెట్రోల్ రూ.167.. లాభాలు తెలిస్తే ఇదే కొట్టిస్తారు..!
E20ని మించిన ఇంధనంపై క్లారిటీ
ఇటీవల E20 పెట్రోల్ అమలు తర్వాత చాలామందిలో మరో సందేహం కూడా నెలకొంది. భవిష్యత్తులో పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని 20 శాతం కంటే ఎక్కువగా పెంచుతారా? అనే ప్రశ్నకు కూడా కేంద్రం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం E20కు మించి ఇథనాల్ బ్లెండింగ్ అమలు చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదని తెలిపింది. దీంతో సమీప భవిష్యత్తులో E25 లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్ వచ్చే అవకాశాలపై ఉన్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడినట్లైంది.
మరోవైపు, గతంలో అందుబాటులో ఉన్న E0 లేదా E10 పెట్రోల్‌ను తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టే ప్రతిపాదన కూడా లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతం అమల్లో ఉన్న E20 విధానమే కొనసాగుతుందని కేంద్రం సంకేతాలు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: RBI: ఇక మార్కెట్లో కొత్త నోట్లు.. చిరగవు, తడవవు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఇథనాల్ రహిత ప్రీమియం పెట్రోల్ కొనసాగుతుండటం హై పెర్ఫార్మెన్స్ వాహనాల యజమానులకు సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. అదే సమయంలో E20 విధానాన్ని కొనసాగిస్తూ, ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది. తాజా ప్రకటనతో ప్రీమియం పెట్రోల్ వినియోగదారులు, ఆటోమొబైల్ రంగం, వాహన యజమానులకు ఉన్న కీలక సందేహాలకు ప్రభుత్వం ఒకేసారి స్పష్టత ఇచ్చినట్లైంది.
ఇది కూడా చదవండి: Success Story: TCS ఉద్యోగాన్ని కాదని.. రూ. 35 ల బియ్యం వ్యాపారంతో ఏటా రూ. 25 లక్షల సంపాదన!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




