AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simhachalam: సింహాచలంలో ప్రకృతి సోయగాలు.. కనువిందు చేస్తున్న నీటి ప్రవాహాలు.. చూసేందుకు రెండు కళ్ళు చాలవు

Simhachalam: సింహాచలంలో కురుస్తున్న వర్షం ఆలయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. వర్షానికి కొండనుంచి నీరు జారి జలపాతాలుగా ప్రవహిస్తున్నాయి. సింహగిరిపై పొంగిపొర్లుతున్న సెలయేళ్లు, మెట్లపై నుంచి కిందకు ప్రవహిస్తున్న వరద నీరు కనువిందు చేస్తున్నాయి. సింహాద్రి అప్పన్న ఆలయానికి వెళ్లే మెట్లు సరికొత్త శోభను

Simhachalam: సింహాచలంలో ప్రకృతి సోయగాలు.. కనువిందు చేస్తున్న నీటి ప్రవాహాలు.. చూసేందుకు రెండు కళ్ళు చాలవు
Simhachalam
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Sep 25, 2026 | 11:15 AM

Share

Simhachalam: గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఆధ్యాత్మిక క్షేత్రమైన సింహాచలంలో ప్రకృతి పులకించింది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో వరద ప్రవాహం కనువిందు చేస్తుంది. కొండపై నుంచి కిందకు ఉధృతంగా ప్రవహిస్తున్న వర్షపు నీటితో సింహగిరి మెట్లు జలపాతాన్ని తలపిస్తున్నాయి. జల ధారలకు నీటి ప్రవాహం పెరిగింది.

సింహాచలంలో కురుస్తున్న వర్షం ఆలయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. వర్షానికి కొండనుంచి నీరు జారి జలపాతాలుగా ప్రవహిస్తున్నాయి. సింహగిరిపై పొంగిపొర్లుతున్న సెలయేళ్లు, మెట్లపై నుంచి కిందకు ప్రవహిస్తున్న వరద నీరు కనువిందు చేస్తున్నాయి. సింహాద్రి అప్పన్న ఆలయానికి వెళ్లే మెట్లు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రవహిస్తున్న నీరు మనోహరమైన దృశ్యాలతో కనువిందు చేస్తోంది. దీంతో.. ముందుజాగ్రత్త చర్యగా.. మెట్లపైకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. ఇక.. కొండపై ఉన్న జల ధారల ప్రవాహం పెరిగింది. పిచుకధార, ఆకాశధార, పొల్లెట్టి ధార వంటి పలు సెలయేళ్లు పొంగిపొర్లుతూ… వాటి ప్రకృతి సుందర శోభనం మరింత పెంచింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య కొద్దిగా తగ్గింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us