AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలు ఇంటి నుంచే ఇలా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి!

TTD 2027 Calendars and Diaries Online Booking: 2027 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని టీటీడీ ప్రచురించిన క్యాలెండర్లు, డైరీలను భక్తులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ సహా పలు నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. బుకింగ్ వివరాలు తెలుసుకోండి.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలు ఇంటి నుంచే ఇలా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి!
Ttd Calender
Rajashekher G
|

Updated on: Nov 09, 2026 | 6:03 PM

Share

TTD 2027 Calendars and Diaries: నూతన సంవత్సరం 2027ను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రచురించిన క్యాలెండర్లు, డైరీలను భక్తులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు సదుపాయం కల్పించింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా భక్తులు తమకు అవసరమైన క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ విక్రయాలతో పాటు తిరుపతి, తిరుమల, తిరుచానూరులోని టీటీడీ ప్రచురణల విక్రయ విభాగానికి చెందిన 12 కేంద్రాల్లోనూ 2027 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్‌లో ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలతో పాటు విజయవాడ, చెన్నై, వెల్లూరు, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ వీటిని విక్రయిస్తున్నారు.

తిరుమల శ్రీవారి చిత్రాలు, ఆధ్యాత్మిక విశేషాలతో రూపొందించిన ఈ క్యాలెండర్లు, డైరీలకు భక్తుల్లో ప్రతి ఏడాది ప్రత్యేక ఆదరణ ఉంటుంది. దేశ, విదేశాల్లోని శ్రీవారి భక్తులు కూడా వీటిని ఆన్‌లైన్ ద్వారా పొందే అవకాశం ఉండటంతో ఈసారి కూడా వీటికి మంచి స్పందన లభించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

కాగా, 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2026 సెప్టెంబర్ 7న ఆవిష్కరించారు. అదే రోజు నుంచి వాటి విక్రయాలను టీటీడీ ప్రారంభించింది.

టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us