AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palolem Beach: ఆసియాలోనే బెస్ట్ బీచ్‌గా గోవా పాలొలెమ్‌.. ఈ బీచ్‌ ప్రత్యేకతలు తెలిస్తే వెళ్లాల్సిందే!

Best Beach in Asia Palolem Beach: గోవాలోని పాలొలెమ్‌ బీచ్‌ 2026 గ్లోబల్ బీచ్‌ ఇండెక్స్‌లో ఆసియాలోనే బెస్ట్‌ బీచ్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆరో ర్యాంక్‌ సాధించిన ఈ బీచ్‌ అందాలు, ప్రత్యేకతలు, చేయాల్సిన పనులు, ఎలా చేరుకోవాలి, సందర్శించేందుకు అనువైన సమయం గురించి తెలుసుకుందాం.

Palolem Beach: ఆసియాలోనే బెస్ట్ బీచ్‌గా గోవా పాలొలెమ్‌.. ఈ బీచ్‌ ప్రత్యేకతలు తెలిస్తే వెళ్లాల్సిందే!
Palolem Beach
Rajashekher G
|

Updated on: Nov 08, 2026 | 10:12 PM

Share

Palolem Beach: గోవా అనగానే అందమైన బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం, సూర్యాస్తమయాలు గుర్తుకొస్తాయి. అలాంటి గోవాలోని పాలొలెమ్‌ బీచ్‌ తాజాగా మరో ప్రత్యేక గుర్తింపు సాధించింది. Beach.com Global Beach Index 2026లో పాలొలెమ్‌ బీచ్‌ ఆసియాలోనే అత్యుత్తమ బీచ్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆరో స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా టాప్‌-25లో చోటు సంపాదించిన ఏకైక ఆసియా బీచ్‌గా నిలవడం విశేషం. ఈ ర్యాంకింగ్‌ను రూపొందించేందుకు నిపుణుల అభిప్రాయాలు, వేలాది మంది పర్యాటకుల సమీక్షలు, అలాగే NASA అందించిన నీటి రంగు, స్పష్టతకు సంబంధించిన డేటాను పరిగణనలోకి తీసుకున్నట్లు Beach.com తెలిపింది.

పాలొలెమ్‌ బీచ్‌ ఎందుకు ప్రత్యేకం?

దక్షిణ గోవాలో ఉన్న పాలొలెమ్‌ బీచ్‌ చంద్రవంక ఆకారంలో ఉంటుంది. రెండు వైపులా కొండలు, చుట్టూ కొబ్బరి చెట్లతో కనిపించే ఈ ప్రాంతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడి ప్రశాంతమైన నీరు ఈతకు అనుకూలంగా ఉంటుంది. సమీపంలోని చిన్న దీవులు, బ్యాక్‌వాటర్స్‌ ఈ ప్రాంతానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. పాలొలెమ్‌లో *సైలెంట్‌ నాయిస్‌ డిస్కో’ కూడా ప్రత్యేక ఆకర్షణ. శనివారం రాత్రుల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో పర్యాటకులు హెడ్‌ఫోన్లు ధరించి తమకు నచ్చిన సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్‌ చేస్తారు.

ఇక్కడ ఏం చేయొచ్చు?

సూర్యాస్తమయం సమయంలో బీచ్‌ వెంట నడవడం మంచి అనుభూతిని ఇస్తుంది. బ్యాక్‌వాటర్స్‌లో కయాకింగ్‌ చేయడంతో పాటు బీచ్‌కు సమీపంలోని మంకీ ఐలాండ్‌కు ప్యాడిల్‌ బోట్‌పై వెళ్లొచ్చు. యోగా, వెల్‌నెస్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునేవారికి సమీపంలో పలు యోగా కేంద్రాలు ఉన్నాయి. ఉదయం వేళ డాల్ఫిన్‌ వాచ్‌ టూర్లకు కూడా వెళ్లవచ్చు. పాలొలెమ్‌కు సమీపంలో అగోండా, పట్నెమ్‌ బీచ్‌లు, అలాగే కోటిగావో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నాయి. దీంతో దక్షిణ గోవాను చుట్టివచ్చేందుకు ఇది మంచి బేస్‌గా ఉంటుంది.

ఎలా చేరుకోవాలి?

డబోలిమ్‌ విమానాశ్రయం పాలొలెమ్‌కు సుమారు 60–65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి ట్యాక్సీ ద్వారా చేరుకోవచ్చు. కనకోణ రైల్వే స్టేషన్‌ బీచ్‌కు సమీపంలోనే ఉంటుంది. స్టేషన్‌ నుంచి ఆటో లేదా ట్యాక్సీ అందుబాటులో ఉంటుంది. మార్గావ్‌, కనకోణ మధ్య బస్సు సర్వీసులు కూడా ఉన్నాయి.

ఎప్పుడు వెళ్లాలి?

నవంబర్‌ నుంచి మార్చి వరకు పాలొలెమ్‌ బీచ్‌ను సందర్శించేందుకు అనువైన సమయం. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వెళ్లాలనుకునేవారు ముందుగానే హోటళ్లు, రవాణా సదుపాయాలను బుక్‌ చేసుకోవడం మంచిది.

Follow Us