AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాఫీ విత్ కరణ్ షోలో షాకింగ్‌ విషయాలు చెప్పిన అక్షయ్

కాఫీ విత్ కరణ్ షోలో షాకింగ్‌ విషయాలు చెప్పిన అక్షయ్

Phani CH
|

Updated on: Nov 28, 2026 | 5:24 PM

Share

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన విలక్షణ పనితీరుపై కాఫీ విత్ కరణ్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని చెప్పడంతో పలువురు నిర్మాతలు తనను తీసుకోడానికి వెనకాడుతున్నారని తెలిపారు. 8 గంటల పని, 8 గంటల నిద్ర, 2 గంటల వ్యాయామంతో కెమెరా ముందు ఫ్రెష్‌గా ఉండగలనని ఆయన వివరించారు.

సాధారణంగా స్టార్ హీరోల మాట చెల్లుబాటు అవుతుందని భావిస్తుంటారు. అయితే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విషయంలో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాఫీ విత్ కరణ్ సీజన్ 9లో నటుడు రవి కిషన్‌తో కలిసి సందడి చేసిన అక్షయ్, తాను తీసుకున్న ఒక కీలక నిర్ణయం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోవాల్సి వచ్చిందని వెల్లడించారు. తాను రోజుకు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తానని ప్రచారం వల్ల చాలా మంది బడా నిర్మాతలు తనను కాస్ట్ చేయడానికి వెనకాడుతున్నారని అక్షయ్ ఓపెన్‌గా చెప్పారు. అయితే, ఆ ఎనిమిది గంటల షిఫ్ట్‌లో తాను ఒక్క క్షణం కూడా వానిటీ వ్యాన్ లోకి వెళ్లకుండా పూర్తిగా సెట్‌లోనే ఉంటాననే విషయాన్ని అందరూ మర్చిపోతున్నారన్నారు. ఎనిమిది గంటల పని, ఎనిమిది గంటల నిద్ర, రెండు గంటల వర్కౌట్, మిగిలిన సమయం కుటుంబానికి కేటాయిస్తేనే కెమెరా ముందు తాజాగా కనిపించగలమని ఆయన స్పష్టం చేశారు. హాలీవుడ్ దర్శకులు క్రిస్టోఫర్ నోలన్ 90 రోజులకు మించి షూటింగ్ చేయరని, టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ చిత్రాన్ని 55 రోజుల్లో పూర్తి చేశారని ఉదహరిస్తూ, తక్కువ సమయంలో సినిమా పూర్తి చేయడంపై వచ్చే విమర్శలకు అక్షయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ చర్చ సినీ పరిశ్రమలో పని గంటలపై మళ్లీ చర్చకు దారితీసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందాన్ని పెంచే క్రీములే అనారోగ్యానికి కారణమా..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఎడారిలో లక్నవరం! బోట్ల స్థానంలో పరుగులు పెడుతున్న వాహనాలు

తల్లి చనిపోగానే చెల్లిని రోడ్డుపాలు చేసిన అన్న!

హైదరాబాద్‌లో చేపల మార్కెట్లపై ఫుడ్‌ సేఫ్టీ దాడులు!

అందం కోసం ఫేస్ క్రీమ్‌లు వాడుతున్నారా ? అయితే ఆసుపత్రిలో చేరాల్సిందే

Follow Us