AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramaprabha: ఆయన నాకు ప్రతి నెల రూ. 25 వేలు పంపుతాడు.. కానీ నేను ఫోన్ చేస్తే ఎత్తడు

సీనియర్ సినీ నటి రమా ప్రభ.. రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ఆడియెన్స కు పరిచయం అక్కర్లేదు వ్యక్తి ఆమె. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన రమా ప్రభ.. ఆతర్వాత లేడీ కమెడియన్ గా మారి తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు రమా ప్రభ.

Ramaprabha: ఆయన నాకు ప్రతి నెల రూ. 25 వేలు పంపుతాడు.. కానీ నేను ఫోన్ చేస్తే ఎత్తడు
Ramaprabha
Rajeev Rayala
|

Updated on: Sep 25, 2026 | 11:26 AM

Share

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని బంధాలు సినిమాలతో మొదలై.. కాలం గడిచేకొద్దీ ఆప్యాయతగా మారిపోతుంటాయి. మరికొన్ని అనుబంధాలకు మాత్రం సినిమాలు, ప్రయోజనాలు, పరిచయాలకంటే అతీతంగా ఉంటాయి. ఇప్పుడు సీనియర్ నటి రమాప్రభ చెప్పిన మాటలు అలాంటి ఓ ప్రత్యేకమైన అనుబంధాన్నే గుర్తుచేస్తున్నాయి. తన కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రమాప్రభ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్ర కథానాయకుల కాలం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి తర్వాతి తరం స్టార్ల వరకు.. ఆ తర్వాతి తరం హీరోలతోనూ ఆమె స్క్రీన్ పంచుకున్నారు. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన ఆమె.. వయసు పెరిగినా నటనకు మాత్రం దూరం కాలేదు. ఈ మధ్య రమాప్రభ సినిమాల స్పీడ్ తగ్గించారు.  రమాప్రభ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో పంచుకుంటున్నారు. ముఖ్యంగా తన ఆర్థిక పరిస్థితులు, హైదరాబాద్ నుంచి బయటకు వెళ్లిన కారణాలు వంటి అంశాలపై ఆమె గతంలో మాట్లాడారు.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

అదే సమయంలో తనకు సహాయం చేస్తున్న వ్యక్తి గురించి రమాప్రభ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. తనకు పూరీ జగన్నాథ్ గత కొంతకాలంగా ప్రతి నెలా ఆర్థిక సహాయం అందిస్తున్నారని రమాప్రభ స్వయంగా వెల్లడించారు. కొన్ని కథనాల ప్రకారం, నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పూరీ తనకు పంపుతున్నారని ఆమె తెలిపారు. అయితే తనకు ప్రతి నెలా డబ్బులు పంపుతున్న పూరీ జగన్నాథ్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు రమాప్రభ ఫోన్ చేసినా.. ఆయన మాత్రం ఫోన్ ఎత్తరని ఆమె అన్నారు. దీనికి కారణం కూడా ఆమె  చెప్పారు. తాను చేస్తున్న సహాయం గురించి ఎదుటివారికి పదేపదే చెప్పుకోవడం పూరీ జగన్నాథ్‌కు ఇష్టం ఉండదని రమాప్రభ అన్నారు. అందుకే తాను థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేసినా ఆయన స్పందించరని ఆమె వివరించారు.

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

రమాప్రభకు, పూరీ జగన్నాథ్‌కు మధ్య పరిచయం ఆయన దర్శకత్వం వహించిన సినిమాల సమయంలో ఏర్పడింది. పూరీ దర్శకత్వం వహించిన ‘బద్రి’, ‘నేను ఇంతే’, ‘దేశముదురు’ వంటి చిత్రాల్లో రమాప్రభ నటించారు. అయితే కేవలం కలిసి పనిచేసినంత మాత్రాన ఇంతటి అనుబంధం ఏర్పడలేదని ఆమె అన్నారు. ఆ మధ్య  ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా షూటింగ్ సమయంలో పూరీని మళ్లీ కలిసిన సందర్భాన్ని కూడా రమాప్రభ గుర్తుచేసుకున్నారు. అప్పుడు పూరీ తన ఫోన్ నంబర్ తీసుకున్నారని ఆమె తెలిపారు. ఆ తర్వాత తన పరిస్థితుల గురించి తెలుసుకున్న పూరీ.. తన బావమరిది రమేష్ ద్వారా సహాయం చేయాలని సంప్రదించినట్లు ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us