AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ వర్షాల్లోనూ తగ్గని భక్తి.. జూమ్ వేలంలో రూ.25 లక్షలు పలికిన గణనాథుడి లడ్డూ!

భారీ వర్షాలున్నా, గణేష్ లడ్డూ వేలాల ఉత్సాహం తగ్గలేదు. మచిలీపట్నంలో 630 కిలోల లడ్డూ జూమ్ వేలంలో రూ.25 లక్షలకు అమ్ముడుపోయింది. హైదరాబాద్‌లోనూ కొండపూర్ (రూ.21.11 లక్షలు), ప్రగతి నగర్, రాజేంద్ర నగర్ లడ్డూలు భారీ ధరలు పలికాయి. ఈసారి బాలాపూర్ లడ్డూ ఎంత పలకనుందో అందరి దృష్టి నెలకొంది.

భారీ వర్షాల్లోనూ తగ్గని భక్తి.. జూమ్ వేలంలో రూ.25 లక్షలు పలికిన గణనాథుడి లడ్డూ!
Machilipatnam Ladu
Balaraju Goud
|

Updated on: Sep 25, 2026 | 10:41 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో జనజీవనాన్ని ప్రభావితం చేసినప్పటికీ.. గణేష్‌ లడ్డూ వేలాలకు మాత్రం భక్తుల ఉత్సాహం తగ్గలేదు. మచిలీపట్నం సముద్ర తీరంలో ప్రతిష్ఠించిన 63 అడుగుల మహా గణపతి కోసం తయారు చేసిన 630 కిలోల భారీ లడ్డూను జూమ్‌ కాల్‌ ద్వారా నిర్వహించిన వేలంలో రూ.25 లక్షలకు గుమ్మడి భవానీ శంకర్‌ దక్కించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు లడ్డూను స్వీకరించారు. ఈ వేలంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో 600 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.

మరోవైపు హైదరాబాద్‌లోనూ గణేష్‌ లడ్డూ వేలాలు భారీ ధరలు పలికాయి. కొండాపూర్‌లోని మై హోమ్‌ మంగళ గేటెడ్‌ కమ్యూనిటీలో లడ్డూ రూ.21.11 లక్షలకు అమ్ముడైంది. ప్రగతినగర్‌లోని రఘుపతి కౌంటీ లడ్డూను రూ.13.66 లక్షలకు దక్కించుకోగా.. రాజేంద్రనగర్‌లోని లాన్‌సమ్‌ ఎటానియా రూ.13.56 లక్షలకు విన్నింగ్‌ బిడ్‌ నమోదు చేసింది. ఇక గణేష్‌ చతుర్థి ఉత్సవాల చివరి రోజున జరిగే బాలాపూర్‌ లడ్డూ వేలంపై అందరి దృష్టి నెలకొంది. 32 ఏళ్లుగా ప్రత్యేక గుర్తింపు పొందిన బాలాపూర్‌ లడ్డూ ఈసారి ఎంత ధర పలుకుతుందనే ఆసక్తి నెలకొంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారీ వర్షాల్లోనూ తగ్గని లడ్డూ క్రేజీ..! జూమ్‌లో వేలం!
భారీ వర్షాల్లోనూ తగ్గని లడ్డూ క్రేజీ..! జూమ్‌లో వేలం!
అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు చూడటం మానేశా..
అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు చూడటం మానేశా..
టేకు ఆకులలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే ఔరా అనాల్సిందే!
టేకు ఆకులలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే ఔరా అనాల్సిందే!
ఐటీ కారిడార్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం..!
ఐటీ కారిడార్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం..!
వైభవ్ సూర్యవంశీకి సవాల్ విసిరిన న్యూజిలాండ్ కోచ్
వైభవ్ సూర్యవంశీకి సవాల్ విసిరిన న్యూజిలాండ్ కోచ్
ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారికి బిగ్‌ అలర్ట్‌.. కొత్త రూల్స్‌..!
ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారికి బిగ్‌ అలర్ట్‌.. కొత్త రూల్స్‌..!
ఈ రాశులకు విపరీత రాజయోగం, లక్ష్మీ కటాక్షంతో పట్టిందల్లా బంగారమే!
ఈ రాశులకు విపరీత రాజయోగం, లక్ష్మీ కటాక్షంతో పట్టిందల్లా బంగారమే!
ఖైరతాబాద్‌ బాహుబలి గణపతికి..రథసారథి ఎవరో తెలుసా? అతడి జీతం ఎంతంటే
ఖైరతాబాద్‌ బాహుబలి గణపతికి..రథసారథి ఎవరో తెలుసా? అతడి జీతం ఎంతంటే
పాలు విరగవు, చల్లారినా చిక్కబడడు.. ఈసారి సేమియా పాయసం ఇలా చేయండి
పాలు విరగవు, చల్లారినా చిక్కబడడు.. ఈసారి సేమియా పాయసం ఇలా చేయండి
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం