హేయ్.. మేడం ఇది మీరేనా.!! నాని ప్యారడైజ్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్ అందుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. తొలిరోజు వసూళ్లలోనూ తన సత్తా చాటింది.

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడగా.. తెరపై కనిపించిన పలువురు నటీనటులు, పాత్రలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్‌గా మారింది. పై ఫొటోలో నాని సినిమాలోని గెటప్‌లో కనిపిస్తున్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? సోషల్ మీడియాలో పాపులర్ ఆమె. ఆమె అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతారు. నెట్టింట ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె మరెవరో కాదు క్రేజీ బ్యూటీ మధు. ‘ది ప్యారడైజ్’లో ఆమె కూడా నటించింది. మధుకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తన ఫొటోలు, వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటూ పాపులర్ అయ్యింది.
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
ఇప్పటివరకు పెద్ద సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోవడంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో చాలామందికి ఆమె పేరు పెద్దగా పరిచయం లేదు. అయితే ఇప్పుడు నాని నటించిన ‘ది ప్యారడైజ్’లో అవకాశం దక్కడంతో ఆమె పేరు ఒక్కసారిగా సినీ ప్రేక్షకుల దృష్టిలోకి వచ్చింది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో నాని, మోహన్ బాబు, కాయదు లోహర్, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక మధు కూడా సినిమాలో ఓ పాత్రలో నటించింది. సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోనూ ఆమె ప్రత్యేకమైన లుక్‌తో సందడి చేశారు. ఆ ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి
సోషల్ మీడియాలో గ్లామర్ లుక్‌లో కనిపించే మధు.. ‘ది ప్యారడైజ్’లో మాత్రం పూర్తిగా భిన్నమైన గెటప్‌లో కనిపించడం విశేషం. దీంతో ఆమెను ఈ లుక్‌లో చూసిన చాలామంది వెంటనే గుర్తుపట్టలేకపోతున్నారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. “అరే.. ఈమె మధునా?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి.. సోషల్ మీడియాలో గ్లామర్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కనిపించే మధు.. ది ప్యారడైజ్ లో మాత్రం ఇలా గుర్తుపట్టలేనంతగా కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




