AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కసారి ఇలా చేసి తింటే ఈ మటన్ పులావ్ ఇంత రుచిగా వచ్చిందా అంటూ రెండు ఫ్లేట్స్ లాగిస్తారు

మీరు ఇప్పటి వరకు మటన్ తో కూర , ఫ్రై, బిర్యానీ చేసుకుని తిని ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయేది దానికి మించిన టేస్ట్ వస్తుంది. ఎక్కువ మసాలాలు అవసరం లేకుండా, మన ఇంట్లో ఉండే పదార్దాలతోనే చాలా సింపుల్ గా,మటన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Nov 09, 2026 | 5:11 PM

Share
మీరు ఇప్పటి వరకు మటన్ తో కూర , ఫ్రై, బిర్యానీ చేసుకుని తిని ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయేది దానికి మించిన టేస్ట్ వస్తుంది. ఎక్కువ మసాలాలు అవసరం లేకుండా, మన ఇంట్లో ఉండే  పదార్దాలతోనే చాలా సింపుల్ గా,మటన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

మీరు ఇప్పటి వరకు మటన్ తో కూర , ఫ్రై, బిర్యానీ చేసుకుని తిని ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయేది దానికి మించిన టేస్ట్ వస్తుంది. ఎక్కువ మసాలాలు అవసరం లేకుండా, మన ఇంట్లో ఉండే పదార్దాలతోనే చాలా సింపుల్ గా,మటన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5
కావలసిన పదార్దాలు : మటన్ ఒక కేజీ, నానబెట్టిన బియ్యం అరకేజి,ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి 2టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి 4, టమాట ముక్కలు పావు కప్పు, పుదీనా అరకప్పు, కొత్తిమీర ఒక కప్పు,అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, కారం 2 స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, బిరియాని పొడి 1 స్పూన్, ధనియా పొడి 1 స్పూన్, జీరా పౌడర్ అర టీస్పూన్, గరం మసాలా అర టీస్పూన్, జాజికాయ పొడి పావు టీస్పూన్,బిరియాని ఆకు 3,దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు 6 తీసుకోవాలి.

2 / 5
ముందుగా స్టవ్ వెలిగించి దానిపై మీడియం సైజు పాన్ పెట్టుకోవాలి. పాన్ వెడెక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్, రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి.ఆయిల్, నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న బిర్యాని మసాలా దినుసులన్నిటిని వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించుకోవాలి.

3 / 5
ఇప్పుడు అందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి.ఆ తర్వాత అరకప్పు టమాట ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి,  ఇప్పుడు రెండు స్పూన్లు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అర టీస్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసి బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత కారం, బిర్యానీ పౌడర్,, ధనియాలా పొడి, జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసి బాగా కలిసేలా వేయించుకోవాలి.  ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కేజీ మటన్ ను అందులో వేసి బాగా కలుపుకోవాలి. మటన్  మసాలాలతో చక్కగా కలిసేలా సుమారు ఐదు నిమిషాల పాటు వెయ్యించుకోవాలి.మటన్ నుంచి ఆయిల్ 
పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు అందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి.ఆ తర్వాత అరకప్పు టమాట ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి, ఇప్పుడు రెండు స్పూన్లు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అర టీస్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసి బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత కారం, బిర్యానీ పౌడర్,, ధనియాలా పొడి, జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసి బాగా కలిసేలా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కేజీ మటన్ ను అందులో వేసి బాగా కలుపుకోవాలి. మటన్ మసాలాలతో చక్కగా కలిసేలా సుమారు ఐదు నిమిషాల పాటు వెయ్యించుకోవాలి.మటన్ నుంచి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.

4 / 5

ఇప్పుడు మందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి సుమారు రెండు నిమిషాల పాటు మటన్ మసాలాలతో కలిసేలా ఫ్రై చేసుకోవాలితర్వాత తగినన్ని నీళ్లు వేసి సరిపడా ఉప్పు వేసుకుని, పైన కొద్దిగా పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విసిల్స్ వచ్చేవరకు పులావ్ ని వుండికించుకుని స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత మొత్తం కుక్కర్ మూతని తీసి చుస్తే మటన్ పులావ్ చాలా పొడి పొడిగా వస్తుంది.

5 / 5
Follow Us