AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చదువు కోసం నిద్రను త్యాగం చేస్తున్నారా? చివరికి మూల్యం చెల్లించాల్సిందే!

మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, చదువు, కెరీర్ ఒత్తిడితో యువత నిద్రకు దూరమవుతోంది. నిద్ర సమయాన్ని తగ్గించడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి దెబ్బతినడమే కాకుండా మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. భారత్‌లో నిద్రలేమి సమస్య పెరుగుతున్న నేపథ్యంలో IIT మద్రాస్‌ ప్రత్యేకంగా స్లీప్ రీసెర్చ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి విద్యార్థుల నిద్ర అలవాట్లపై అధ్యయనం చేస్తోంది.

చదువు కోసం నిద్రను త్యాగం చేస్తున్నారా? చివరికి మూల్యం చెల్లించాల్సిందే!
Sleep Deprivation
Siva Nagaraju
| Edited By: |

Updated on: Nov 25, 2026 | 9:41 PM

Share

నిద్ర. మనిషి శరీరానికి ప్రకృతి ఇచ్చిన సహజమైన విశ్రాంతి. కానీ మారుతున్న జీవనశైలిలో ఇప్పుడు అదే నిద్రకు కరువవుతున్నారు చాలామంది. ముఖ్యంగా యువత పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. అర్ధరాత్రి దాటినా మొబైల్‌ ఫోన్లు, సోషల్‌ మీడియా, గేమింగ్‌, ల్యాప్‌టాప్‌లతోనే కాలం గడుపుతున్నారు. చదువు, పరీక్షలు, అసైన్‌మెంట్లు, ప్లేస్‌మెంట్ల ఒత్తిడితో నిద్ర సమయాన్ని తగ్గించుకుంటున్నారు. కెరీర్‌ కోసం నిద్రను త్యాగం చేస్తున్నారు. కానీ ‘అతి సర్వత్రా వర్జయేత్‌’ అన్నట్లు.. ఏ విషయంలోనైనా అతిగా వ్యవహరిస్తే చివరకు నష్టమే ఎదురవుతుంది. నిద్రను తగ్గించడం వల్ల చదువులోనే కాదు. ఆరోగ్యంలోనూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. నిద్రలేమితో ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి దెబ్బతినడం, చిరాకు, ఒత్తిడి, మానసిక ఆందోళన, డిప్రెషన్‌ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో శారీరక ఆరోగ్యంపైనా నిద్రలేమి ప్రభావం చూపుతుంది. అంటే ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న మాటను మరిచి.. విజయాల వెంట పరుగులు తీస్తూ ఆరోగ్యాన్నే నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. భారత్‌లో ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారు? భారత్‌లో నిద్రలేమి సమస్య ఎంత తీవ్రంగా ఉందో పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. 100 అధ్యయనాలను విశ్లేషించిన ఒక మెటా-అనాలిసిస్‌ ప్రకారం. దేశంలో సుమారు 25.7 శాతం మందిలో నిద్రలేమి లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణ జనాభాను మాత్రమే తీసుకుంటే ఈ రేటు సుమారు 15.1 శాతంగా ఉంది. అంటే ప్రతి వంద మందిలో దాదాపు 15 మందికి నిద్రలేమి సమస్య ఉండొచ్చన్నమాట. ఇక 2026లో వచ్చిన మరో పరిశోధనలో...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
యువతకు నిద్ర కరువు.. అర్ధరాత్రి వరకు ఫోన్‌తోనే జాగారం!
యువతకు నిద్ర కరువు.. అర్ధరాత్రి వరకు ఫోన్‌తోనే జాగారం!
ఇద్దరూ తోపు హీరోలే.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇద్దరూ తోపు హీరోలే.. ఎవరో గుర్తుపట్టారా.. ?
కార్తీక మాసాన్ని దామోదర మాసం అని ఎందుకు అంటారు? శ్రీకృష్ణుడి..
కార్తీక మాసాన్ని దామోదర మాసం అని ఎందుకు అంటారు? శ్రీకృష్ణుడి..
జమ్మూలో హై అలర్ట్.. అడవులను జల్లెడ పడుతున్న సైన్యం!
జమ్మూలో హై అలర్ట్.. అడవులను జల్లెడ పడుతున్న సైన్యం!
బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్.. కళ్లు చెదిరే వడ్డీతో కొత్త స్కీమ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్.. కళ్లు చెదిరే వడ్డీతో కొత్త స్కీమ్
ఊపిరి తీసుకోవడమే ప్రమాదమా?.. వైద్య నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్!
ఊపిరి తీసుకోవడమే ప్రమాదమా?.. వైద్య నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్!
గుడిలోకి వెళ్లే ముందు గంట ఎందుకు మోగిస్తారు? ఆధ్యాత్మిక రహస్యం..
గుడిలోకి వెళ్లే ముందు గంట ఎందుకు మోగిస్తారు? ఆధ్యాత్మిక రహస్యం..
ఓటర్లకు అలర్ట్.. ఓటర్ లిస్టులో తప్పులుంటే సరిచేస్తామంటున్న ఈసీ!
ఓటర్లకు అలర్ట్.. ఓటర్ లిస్టులో తప్పులుంటే సరిచేస్తామంటున్న ఈసీ!
 పిల్లల చదువు, పెళ్లి కోసం బెస్ట్ పెట్టుబడి పథకాలివే!
 పిల్లల చదువు, పెళ్లి కోసం బెస్ట్ పెట్టుబడి పథకాలివే!
హైదరాబాద్ నుంచి కాశీ, అయోధ్య సహా పుణ్యక్షేత్రాల సందర్శనకు టూర్..
హైదరాబాద్ నుంచి కాశీ, అయోధ్య సహా పుణ్యక్షేత్రాల సందర్శనకు టూర్..