AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూ కాశ్మీర్‌ అడవుల్లో 65 మంది విదేశీ ఉగ్రవాదులు.. భద్రతా దళాల భారీ వేట షురూ..!

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌కు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా జమ్మూ డివిజన్‌లోని దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో దాక్కున్న విదేశీ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. నిఘా వర్గాల అంచనా ప్రకారం జమ్మూ కాశ్మీర్‌లో సుమారు 65 మంది విదేశీ ఉగ్రవాదులు చురుకుగా ఉన్నట్లు తెలుస్తోంది.

జమ్మూ కాశ్మీర్‌ అడవుల్లో 65 మంది విదేశీ ఉగ్రవాదులు.. భద్రతా దళాల భారీ వేట షురూ..!
Jammu Terrorist Jem
Balaraju Goud
|

Updated on: Nov 25, 2026 | 9:33 PM

Share

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌కు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా జమ్మూ డివిజన్‌లోని దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో దాక్కున్న విదేశీ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. నిఘా వర్గాల అంచనా ప్రకారం జమ్మూ కాశ్మీర్‌లో సుమారు 65 మంది విదేశీ ఉగ్రవాదులు చురుకుగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో అత్యధికులు పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలతో సంబంధం కలిగి ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. వీరిని పట్టుకునేందుకు సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు.

65 మంది విదేశీ ఉగ్రవాదులు.. నిఘా వర్గాల అంచనా!

భద్రతా సంస్థల అంచనాల ప్రకారం ఈ 65 మందిలో సుమారు 35 మంది లష్కరే తోయిబాకు, 20 మంది జైషే మహ్మద్‌కు చెందినవారిగా భావిస్తున్నారు. మరో 10 మంది ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం. పూంచ్, రాజౌరి, కిష్త్వార్, దోడా, కతువా, ఉధంపూర్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో వీరి కోసం గాలింపు కొనసాగుతోంది.

జమ్మూ డివిజన్‌లో నలుగురు స్థానిక ఉగ్రవాదులు

విదేశీ ఉగ్రవాదులతో పాటు జమ్మూ డివిజన్‌లో నలుగురు స్థానిక ఉగ్రవాదులు కూడా భద్రతా బలగాలకు సవాలుగా మారారు. వీరిలో ఒకరు జైషే మహ్మద్‌తో, మరో ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధం ఉన్నవారిగా నిఘా వర్గాలు చెబుతున్నాయి. కతువా జిల్లాలోని బిల్లవార్-మల్హార్ ప్రాంతానికి చెందిన నిక్కు అనే ఉగ్రవాది కతువా, ఉధంపూర్ కొండ ప్రాంతాల్లో చురుకుగా ఉన్నట్లు సమాచారం. అడవులు, పర్వత ప్రాంతాలపై అతడికి అవగాహన ఉండటంతో భద్రతా బలగాలకు పట్టుకోవడం సవాలుగా మారింది.

కిష్త్వార్‌లో ముగ్గురు హిజ్బుల్ ఉగ్రవాదుల కోసం వేట

కిష్త్వార్ జిల్లాలో మరో ముగ్గురు స్థానిక ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. వీరిలో మహమ్మద్ అమీన్ అలియాస్ జహంగీర్ సరూరి, రియాజ్ అహ్మద్ అలియాస్ హజారీ, ముదాసిర్ హుస్సేన్ ఉన్నారు. వీరికి హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం.

ఇటీవల కిష్త్వార్‌లోని దాచన్ ప్రాంతంలో ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (SPOలు) హత్యకు గురైన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ముగ్గురు ఉగ్రవాదుల ఆచూకీ తెలిపిన వారికి రూ.30 లక్షల రివార్డు ప్రకటించినట్లు సమాచారం. వారి ఫొటోలతో పోస్టర్లు కూడా విడుదల చేశారు.

80కి పైగా తాత్కాలిక ఆపరేషన్ స్థావరాలు

ఉగ్రవాదుల కదలికలను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు కీలక చర్యలు చేపట్టాయి. జమ్మూ కాశ్మీర్‌లోని మారుమూల, ఎత్తైన ప్రాంతాల్లో 80కి పైగా తాత్కాలిక ఆపరేషన్ స్థావరాలను ఏర్పాటు చేశాయి. వీటిలో అనేక స్థావరాలు సముద్ర మట్టానికి 10 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్నాయి. దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో ఉగ్రవాదులు తలదాచుకునే అవకాశాలను తగ్గించేందుకు సైన్యం, సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. సహజ గుహలు, తాత్కాలిక షెల్టర్లలో ఉగ్రవాదులు దాక్కుని ఉండవచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి.

చలికాలానికి ముందే భారీ ఆపరేషన్లు

శీతాకాలం సమీపిస్తుండటంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలను మరింత వేగవంతం చేస్తున్నాయి. ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురవడం ప్రారంభమైతే ఉగ్రవాదులు దిగువ ప్రాంతాలకు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో కతువా, ఉధంపూర్, దోడా, కిష్త్వార్, రియాసి జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.

మొత్తంగా చూస్తే.. కాశ్మీర్ లోయలో స్థానిక ఉగ్రవాదుల నెట్‌వర్క్ బలహీనపడిన నేపథ్యంలో ఇప్పుడు జమ్మూ ప్రాంతంలోని విదేశీ ఉగ్రవాదుల కదలికలు భద్రతా సంస్థలకు ప్రధాన సవాలుగా మారాయి. ఉగ్రవాదులను పట్టుకోవడంతో పాటు వారికి ఆశ్రయం కల్పిస్తున్న నెట్‌వర్క్‌లు, చొరబాటు మార్గాలను కూడా గుర్తించి నిర్మూలించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కార్తీక మాసాన్ని దామోదర మాసం అని ఎందుకు అంటారు? శ్రీకృష్ణుడి..
కార్తీక మాసాన్ని దామోదర మాసం అని ఎందుకు అంటారు? శ్రీకృష్ణుడి..
జమ్మూలో హై అలర్ట్.. అడవులను జల్లెడ పడుతున్న సైన్యం!
జమ్మూలో హై అలర్ట్.. అడవులను జల్లెడ పడుతున్న సైన్యం!
బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్.. కళ్లు చెదిరే వడ్డీతో కొత్త స్కీమ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్.. కళ్లు చెదిరే వడ్డీతో కొత్త స్కీమ్
ఊపిరి తీసుకోవడమే ప్రమాదమా?.. వైద్య నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్!
ఊపిరి తీసుకోవడమే ప్రమాదమా?.. వైద్య నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్!
గుడిలోకి వెళ్లే ముందు గంట ఎందుకు మోగిస్తారు? ఆధ్యాత్మిక రహస్యం..
గుడిలోకి వెళ్లే ముందు గంట ఎందుకు మోగిస్తారు? ఆధ్యాత్మిక రహస్యం..
ఓటర్లకు అలర్ట్.. ఓటర్ లిస్టులో తప్పులుంటే సరిచేస్తామంటున్న ఈసీ!
ఓటర్లకు అలర్ట్.. ఓటర్ లిస్టులో తప్పులుంటే సరిచేస్తామంటున్న ఈసీ!
 పిల్లల చదువు, పెళ్లి కోసం బెస్ట్ పెట్టుబడి పథకాలివే!
 పిల్లల చదువు, పెళ్లి కోసం బెస్ట్ పెట్టుబడి పథకాలివే!
హైదరాబాద్ నుంచి కాశీ, అయోధ్య సహా పుణ్యక్షేత్రాల సందర్శనకు టూర్..
హైదరాబాద్ నుంచి కాశీ, అయోధ్య సహా పుణ్యక్షేత్రాల సందర్శనకు టూర్..
రోజూ తినే ఈ పదార్థాలతో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం.. జాగ్రత్త!
రోజూ తినే ఈ పదార్థాలతో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం.. జాగ్రత్త!
కలయా.. నిజమా.. కిర్రాక్ ఫీచర్లతో స్మార్ట్‌వాచ్.. కేవలం రూ.902కే !
కలయా.. నిజమా.. కిర్రాక్ ఫీచర్లతో స్మార్ట్‌వాచ్.. కేవలం రూ.902కే !