జై బోలో గణేష్ మహారాజ్‌కి.. ఖైరతాబాద్ మహా గణపతి వీడియో చూస్తే పూనకాలే..
హైదరాబాద్‌లో ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. వేలాది మంది భక్తులు పాల్గొంటుండగా, ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. బడా గణేష్ శోభాయాత్ర వీడియో చూడండి..

ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంతరాలు రాకుండా పోలీసుల ముందస్తు చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటకల్లా నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. సీసీ, డ్రోన్ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం నిఘా ఉంచారు. బడా గణేష్ శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్, టెలిఫోన్ భవన్ మీదుగా కొనసాగనుంది.. ఇక్బాల్ మినార్, తెలంగాణతల్లి చౌరస్తా.. ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభాయాత్ర కొనసాగనుంది.. నిమజ్జనానికి ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఏర్పాట్లు చేశారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర మహాగణపతి నిమజ్జనం జరగనుంది. కాగా.. ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర వీడియో వైరల్ అవుతోంది..
వీడియో చూడండి..
మరోవైపు, ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర సాఫీగా సాగేందుకు బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ఉత్సవ సమితులు, వివిధ శాఖల అధికారులతో కలిసి సంయుక్త రూట్ తనిఖీలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో రోడ్ల మరమ్మతులు, విద్యుత్ తీగల తొలగింపు, చెట్ల కొమ్మల కత్తిరింపు వంటి ఏర్పాట్లన్నీ పకడ్బందీగా పూర్తి చేశారు.
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం కొనసాగుతోంది. నగరంలోని ప్రతీ బజారు, కాలనీ, మండపంలో తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను భక్తులు శోభాయాత్రగా హుస్సేన్‌సాగర్‌కు నిమజ్జనం కోసం తరలిస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ భక్తుల కోలాహలం, ‘జై బోలో గణేష్ మహారాజ్ కీ జై’ అనే నినాదాలతో మార్మోగుతున్నాయి. నగరవ్యాప్తంగా తరలివస్తున్న లక్షలాది విగ్రహాలతో నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాలు విద్యుత్ కాంతులతో శోభాయమానంగా మారాయి. భారీ జనసందోహం, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను విధించారు.
