AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Records: ఒకే మ్యాచ్‌లో 50+ పరుగులు, 4 క్యాచ్‌లు, 1 వికెట్..  సచిన్ రికార్డు సమం చేసిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్

Cricket Records: క్రికెట్ రికార్డ్స్‌లో మార్కో జాన్సెన్ అరుదైన ఘనత సాధించారు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో 75 పరుగులు, ఒక వికెట్, నాలుగు క్యాచ్‌లతో సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశారు. ఈ ఫీట్‌తో వన్డే క్రికెట్‌లో ఈ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నారు. అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించారు.

Cricket Records: ఒకే మ్యాచ్‌లో 50+ పరుగులు, 4 క్యాచ్‌లు, 1 వికెట్..  సచిన్ రికార్డు సమం చేసిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
Cricket Records
Rakesh
|

Updated on: Sep 25, 2026 | 11:40 AM

Share

Cricket Records: సౌతాఫ్రికా యువ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ (Marco Jansen) ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించారు. కేవలం బ్యాటింగ్, బౌలింగ్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టిన ఆయన, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డును సమం చేశారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మార్కో జాన్సెన్‎, ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా, సౌతాఫ్రికా తరఫున తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కారు.

ఒక వన్డే మ్యాచ్‌లో 50కి పైగా పరుగులు సాధించడంతో పాటు, కనీసం 1 వికెట్ పడగొట్టి, సరిగ్గా 4 క్యాచ్‌లు అందుకోవడం అంత సులువైన విషయం కాదు. ఇంతకుముందు ఈ అరుదైన ఫీట్‌ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 1998లో పాకిస్థాన్‌పై సాధించారు. ఆ తర్వాత యూనిస్ ఖాన్, మైకేల్ క్లార్క్, మార్నస్ లబుషేన్ వంటి దిగ్గజాలు ఈ జాబితాలో చేరారు. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాపై 75 పరుగులు చేసి, 1 వికెట్ తీసి, 4 క్యాచ్‌లు పట్టిన మార్కో జాన్సెన్‎ ఆ క్లబ్‌లో ఐదో ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా జట్టు మ్యాథ్యూ బ్రీట్జ్‌కే అద్భుతమైన సెంచరీ (106 బంతుల్లో 106 పరుగులు) సహాయంతో నిర్ణీత ఓవర్లలో 297 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో మార్కో జాన్సెన్‎ సైతం అద్భుతంగా ఆడి 75 కీలక పరుగులు చేసి బ్రీట్జ్‌కేతో కలిసి ఆరో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఈ జోడీ సౌతాఫ్రికా జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించడంలో ప్రధాన పాత్ర పోషించింది.

298 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ మిచెల్ మార్ష్ (60 పరుగులు), ట్రావిస్ హెడ్ (36 పరుగులు) కలిసి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఒక దశలో ఆసీస్ జట్టు సులభంగా గెలిచేలా కనిపించింది. అయితే సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తన మాయాజాలంతో ఆసీస్ బ్యాటర్లను కోలుకోలేని దెబ్బతీశాడు. వరుస వికెట్లు పడగొట్టి ఒత్తిడి పెంచడంతో ఆస్ట్రేలియా జట్టు కేవలం 230 పరుగులకే ఆలైట్ అయింది. దీంతో సౌతాఫ్రికా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..
గాల్లో ఉండగా ఎయిర్‌ ఇండియా విమానానికి 7500 కోడ్.. కాసేపటికే..
గాల్లో ఉండగా ఎయిర్‌ ఇండియా విమానానికి 7500 కోడ్.. కాసేపటికే..
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు
నా జీవితం లో ఇంత తెలివున్న వ్యక్తిని చూడలేదు..
నా జీవితం లో ఇంత తెలివున్న వ్యక్తిని చూడలేదు..
వినూత్న సాగుతో జాతీయ అవార్డు నెగ్గిన జగిత్యాల మహిళా రైతు!
వినూత్న సాగుతో జాతీయ అవార్డు నెగ్గిన జగిత్యాల మహిళా రైతు!
బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో
బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..