September 23, 2026
Subhash
బంగారం కొనుగోలు చేసే వారికి UPI లావాదేవీల్లో మార్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని UPI చెల్లింపులపై కొత్తగా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి రానుంది.
అక్టోబర్ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన వ్యాపార సంబంధిత UPI లావాదేవీలపై 0.4 శాతం MDR వర్తించనుంది. అయితే ఈ ఛార్జీలు లావాదేవీ రకం, వ్యాపారి వర్గీకరణ ఆధారంగా మారుతాయి.
0.4 శాతం రేటు వర్తించే లావాదేవీకి ఉదాహరణగా.. రూ.50,000 చెల్లింపుపై రూ.200, రూ.75,000 చెల్లింపుపై రూ.300 MDR అవుతుంది. ఈ ఛార్జ్ కస్టమర్‌పై కాదు. వ్యాపారిపై ఉంటుంది.
బంగారం కొనుగోళ్లలో సాధారణంగా పెద్ద మొత్తాల్లో చెల్లింపులు జరుగుతుంటాయి. అందువల్ల UPI ద్వారా జరిగే అర్హమైన లావాదేవీలపై MDR విధిస్తే జ్యువెలరీ వ్యాపారులకు అదనపు నిర్వహణ ఖర్చులు ఏర్పడవచ్చు.
కొత్త MDR ఛార్జీని వినియోగదారులపై విధించడం లేదని NPCI స్పష్టం చేసింది. ఈ ఛార్జీ వ్యాపారులకే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
వ్యాపారుల నిర్వహణ ఖర్చులతో భవిష్యత్తులో ధరలపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయ, రూపాయి విలువ, సుంకాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి.
కొత్త ఛార్జీలు అన్ని వ్యాపారులకు ఒకే విధంగా వర్తించవు. చిన్న వ్యాపారులకు జీరో MDR ప్రయోజనం కొనసాగుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి.
UPI చెల్లింపులపై MDR మార్పులు బంగారు ఆభరణాల వ్యాపారుల ఖర్చులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కానీ ఈ ఛార్జీని నేరుగా కస్టమర్లపై విధించడం లేదని అధికారులు స్పష్టం చేశారు.