బాలీవుడ్ కె పరిమితం అవుతున్న రకుల్.. టాలీవుడ్ లో కనిపించడం కష్టమేనా.?

Rajeev 

02  march 2026

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు సినిమా ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.

తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటుంది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు వెండితెరపైకి అడుగు పెట్టి తన నటన, అందంతో ఎంతో మంది మదిని దోచుకుంది. 

టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. వరసగా మూవీస్ చేస్తూ, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది.

కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఇటీవలే అజయ్ దేవగన్ నటిస్తోన్న దేదే ప్యార్ దే 2 చిత్రంలో నటించింది. ఈ సినిమాలో ఆర్ మాధవన్, టబు కీలకపాత్రలు పోషించారు.  

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా బిజీగా ఉంటుంది. ఓ రేంజ్ లో అందాలతో కవ్విస్తుంది రకుల్ ప్రీత్ సింగ్.