- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Leaving a job at TCS to enter films, Popular With Ram Charan Movie, She Is Pujitha Ponnada
TCSలో జాబ్ వదిలేసి సినిమాల్లోకి .. రామ్ చరణ్ మూవీతో క్రేజ్.. ఎవరీ హీరోయిన్..
అచ్చ తెలుగమ్మాయి.. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటుంది. సినీరంగంలోకి అడుగుపెట్టకముందు ప్రముఖ టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వర్క్ చేసింది. కానీ నటనపై ఆసక్తితో లక్షల జీతం వదులుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఈ అమ్మడు చేసిన ఓ సినిమాతో తెలుగులో విపరీతమైన క్రేజ్ వచ్చింది.
Updated on: Apr 02, 2025 | 1:34 PM

ప్రస్తుతం అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది తెలుగమ్మాయి పూజిత పొన్నాడ. 2016లో నాగార్జున, కార్తీ నటించిన ఊపిరి సినిమాతో ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది.

ఆ తర్వాత ప్రేమమ్ సినిమాలో కాలేజీ స్టూడెంట్ గా కనిపించింది. ఇందులో నాగచైతన్య హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో పూజితకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగులో మాత్రం వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత కలిసి నటించిన రంగస్థలం సినిమాలో కీలకపాత్రలో కనిపించింది పూజిత. ఇందులో హీరో ఆది ప్రేయసిగా నటించి మెప్పించింది. రంగస్థలం సినిమాతోనే పూజితకు తెలుగులో క్రేజ్ వచ్చింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత కలిసి నటించిన రంగస్థలం సినిమాలో కీలకపాత్రలో కనిపించింది పూజిత. ఇందులో హీరో ఆది ప్రేయసిగా నటించి మెప్పించింది. రంగస్థలం సినిమాతోనే పూజితకు తెలుగులో క్రేజ్ వచ్చింది.

అలాగే ఇటు సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.





























