- Telugu News Photo Gallery Cinema photos Seethamma vakitilo Sirimalle Chettu movie actress Abhiyana glamour photos
గ్లామర్ లుక్‌లో మహేష్ బాబు చెల్లి.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
అందాల ముద్దుగుమ్మ అభినయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ బ్యూటీ మాత్రం మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ అమ్మడు స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.
Updated on: Apr 02, 2025 | 1:42 PM

మహేష్ బాబు, విక్టరి వెంకటేష్ కలిసి నటించి మంచి హిట్ అందుకున్న మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ మూవీలో ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారనే చెప్పాలి. ఈ మూవీలో తమ నటనతో చాలా మంది నటీనటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో అభినయ ఒకరు.

అభినయ గురించి ఎంత చెప్పినా తక్కువే. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన ఈ బ్యూటీ కానీ తన నటనతో మాత్రం స్టార్ స్టేటస్ అందుకుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు చెల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అచ్చం తెలుగు అమ్మాయిలా సాంప్రదాయంగా కనిపించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో చాలానే అవకాశాలు వచ్చాయి. దీంతో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలతో కుర్రకారు మనసు దోచేసుకుంటుంది.

తాజాగా ఈ చిన్నది తన ఇన్ స్టాలో గ్లామరస్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు, చాలా అందంగా, గ్లామర్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.



