Tollywood: హనీమూన్‌లో భార్యను స్నేహితులకు వేలం పెట్టిన భర్త.. ఈ హీరోయిన్ జీవితం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
వెండితెరపై అందం, అభినయంతో మాయ చేసింది. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్గా దూసుకుపోయింది. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ నిజ జీవితంలో మాత్రం భర్త చేతిలో ఎన్నో చిత్రహింసలు అనుభవించింది. చివరకు అతడితో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో 90’sలో ఆమె టాప్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్‌తో కొన్నాళ్లపాటు ప్రేమాయణం సాగించింది. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఘనంగా నిశ్చితార్థం సైతం జరిగింది. కానీ అనుకోకుండా వీరి పెళ్లి రద్దు అయ్యింది. ఆ తర్వాత ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్ కలలు చెదిరిపోయాయి. భర్త చేతిలో దారుణంగా మోసపోయింది. దాంపత్య జీవితంలో కేవలం బాధ, అవమానాలను మాత్రమే భరించాల్సి వచ్చింది. 2016లో భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె.. ఇప్పుడు ఒంటరిగా జీవిస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. తనే బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్. వెండితెరపై అందం, అభినయంతో కట్టిపడేసిన ఆమె జీవితంలో అత్యంత భయంకరమైన క్షణాలను అనుభవించింది.
ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అభిషేక్ బచ్చన్, కరిష్మా కపూర్ మోస్ట్ లవబుల్ జోడి. వీరిద్దరి వివాహం సైతం నిశ్చయించారు. కానీ కొన్ని కారణాలతో వీరిద్దరి పెళ్లి జరగలేదు. ఆ తర్వాత కరిష్మా 2003లో వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను వివాహం చేసుకుంది. హానీమూన్‌కు వెళ్లిన సమయంలో తన భర్త తనను వేలానికి పెట్టాడని.. అతడి స్నేహితులతో రాత్రి గడపాలని తనను వేధించాడని కరిష్మా ఆరోపించింది. ఆమె నిరాకరించడంతో తనను చిత్రహింసలు పెట్టాడని.. తన పట్ల తన భర్త ఇంత అమానుషంగా ప్రవర్తిస్తాడని ఎప్పుడూ ఊహించలేదని చెప్పుకొచ్చింది.
ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు తన అత్తయ్య కూడా తనను కొట్టారని.. భర్త, అత్తింటి వేధింపులతో తాను మానసికంగా, శారీరకంగా ఎన్నో బాధలు అనుభవించినట్లు చెప్పుకొచ్చింది. తన భర్త సంజయ్ చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని ఆమెను కొడతాడని.. తనతో పెళ్లి తర్వాత కూడా సంజయ్ తన మొదటి భార్యతో కలిసి ఉన్నాడని.. ఒకవైపు తనను వేధిస్తూనే మరోవైపు తన మొదటి భార్యతో సంతోషంగా జీవిస్తున్నాడని కరిష్మా తెలిపింది. కరిష్మా చివరకు 2016లో సంజయ్ కపూర్ నుండి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తన కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..