- Telugu News Photo Gallery Cinema photos Know This Actress First Telugu Movie Dizaster. Now She Acted In 3 Movies At This Years, She Is Bhagyashri Borse
Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
తెలుగులో చేసిందే ఒక్క సినిమా. అది కూడా డిజాస్టర్.. కానీ ఈ బ్యూటీకి అదృష్టం కలిసొచ్చింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ జోరు మీద దూసుకుపోతుంది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో సత్తా చాటుతుంది ఈ హీరోయిన్. ఒక్క ఏడాదిలోనే ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తుంది.
Updated on: Mar 26, 2025 | 3:05 PM

మాస్ మాహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ ఈ బ్యూటీ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

తెలుగులో చేసిన ఒక్క సినిమా నిరాశపరిచింది కానీ... ఈ అమ్మడు స్పీడ్ మాత్రం మాములుగా లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ చూస్తుండగానే స్టార్ బ్యూటీలను వెనక్కు నెట్టేస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతోంది ఈ బ్యూటీ.

ఫస్ట్ సినిమాతోనే యాక్టింగ్, గ్లామర్ పరంగా మంచి మార్కులే కొట్టేసిన ఈ వయ్యారి.. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ సరసన కాంత సినిమాలో నటిస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ జోడిగా కింగ్ డమ్ మూవీ చేస్తుంది. ఇవే కాకుండా తెలుగులో మరిన్ని ఆఫర్స్ కొట్టేసింది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో కలిసి కొత్త ప్రాజెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఏడాదిలోనే ఏకంగా మూడు సినిమాలో అడియన్స్ ముందుకు రానుంది ఈ వ్యయారి. కింగ్ డమ్ సినిమాలో మేలో రిలీజ్ కానుంది.

రామ్ పోతినేనితో చేస్తోన్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే నటిస్తోన్న కాంత మూవీ ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.





























