- Telugu News Photo Gallery Cinema photos These are the wives of star heroes who acted with Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవితో చిందులేసిన స్టార్ హీరోల భార్యలు వీరే!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ హీరో తన స్వయంకృషితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు.ఇక హీరో సరసన ఎంతో మంది నటీమణులు నటించారు. అంతే కాకుండా ఆ రోజుల్లో చిరు పక్కన నటించాలంటే కొందరు భయపడిపోయేవారు. ఎందుకంటే ఆయనతో డ్యాన్స్ చేయడం ఆరోజుల్లో అది పెద్ద సవాలే. ఇక చిరు సరసన నటించిన హీరోయిన్లలో విజయశాంతి, రాధిక, శ్రీదేవీ, రాధిక పెయిర్ జోడిగా నిలిచారు. వీరే కాకుండా చిరుతో స్టార్ హీరోల భార్యలు కూడా జోడి కట్టారు. ఇంతకీ వారు ఎవరంటే?
Updated on: Mar 27, 2025 | 11:06 AM

చిరంజీవి సూపర్ హిట్ చిత్రాల్లో రాజా విక్రమార్క్ ఒకటి. ఈ సినిమాలో చిరుకి జోడిగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున భార్య అమల నటించి తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ మూవీ రిలీజైన రెండు సంవత్సరాలకు నాగార్జున, అమల వివాహం చేసుకోవడం విశేషం.

ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి,ఫ్యామిలీని చూసుకుంటున్న హీరోయిన్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత ఒకరు. ఈ నటి చిరుతో రొమాన్స్ చేసింది. చిరు డిజాస్టర్ మూవీలో అంజి మూవీ ఒకటి. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నమ్రత నటించింది.

స్టార్ హీరో సూర్య , నటి జ్యోతికను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. జ్యోతిక చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఠాగూర్ లో కలిసి నటించారు.

సీనియర్ హీరోయిన్ రాధిక చిరంజీవి కలిసి దొంగ మొగుడు, న్యాయం కావాలి వంటి అనేక చిత్రాల్లో కలిసి నటించారు. ఇక ఈ నటి హీరో శరత్ కుమార్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

సీనియర్ బ్యూటీ సుమలత చిరంజీవి కలిసి శుభ లేఖ, చట్టంతో పోరాటం వంటి చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఇక ఈ నటి కన్నడ నటుడు అంబరీష్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.





























