తెల్ల చీరలో ఎంత ముద్దుగుందో.. ఈ బ్యూటీ అందాలు చూడతరమా..
బాలీవుడ్ నటి అన్వేషి జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. తన అంద చందాలతో బాలీవుడ్, టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ తన అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.
Updated on: Mar 27, 2025 | 1:03 PM

అందాల ముద్దుగుమ్మ అన్వేషి జైన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్లో వరసగా వెబ్ సిరీస్ లు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ అమ్మడు.

ఇక ఈ బ్యూటీ కమిట్మెంట్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఐటమ్ సాంగ్ లో మెరిసింది.

ఇక రీసెంట్ గా డ్రాగన్ మూవీలో నటించి మెప్పించింది ఈ అమ్మడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

డ్రాగన్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న అన్వేషి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. తాజాగా ఈ నటి తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫొటోలు నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

తెల్ల చీరలో చూడముచ్చటగా కనిపిస్తుంది ఈ అందాల తార. వైట్ శారీ, మల్లె పూలు పెట్టుకొని చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.





























