భాగ్యశ్రీ బోర్సే స్పీడ్ కు బ్రేకులు.. చేతిలో ఒకే ఒక్క సినిమా 

Rajeev 

03  march 2026

భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు కుర్రాళ్ల కొత్త నేషనల్ క్రష్. గతేడాది మాస్ మహరాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అమ్మడు.

తొలి చిత్రంలోనే గ్లామర్ షోతోపాటు అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి. కానీ ఫస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో ఆమెకు పెద్దగా హెల్ప్ కాలేదు.

అయితే తెలుగులో నెమ్మదిగా ఆఫర్స్ మాత్రం అందుకుంది. మిస్టర్ బచ్చన్ తర్వాత ఈ అమ్మడు నటించిన కింగ్డమ్ సినిమా విడుదలైంది.

ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత రామ్ తో కలిసి ఓ సినిమా దుల్కర్ తో ఓ సినిమా చేసింది. 

ఆంధ్రకింగ్ తాలూకా, దుల్కర్ కాంతా సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దాంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గుతూ వస్తున్నాయి. 

ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న లెనిన్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తప్ప ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో మరో సినిమా లేదు.