- Telugu News Photo Gallery Cinema photos Gautham Ghattamaneni, akira nandan, mokshagna teja tollywood entry update on 26 03 2025
రాబోయే కాలానికి కాబోయే ‘ముగ్గురు మొనగాళ్లు’.. అందరి ఫోకస్ వాళ్లపైనే
టాలీవుడ్‌లోకి మళ్లీ వారసులు వచ్చే సమయం ఆసన్నమైంది. 20 ఏళ్ళ కింద వరసగా పెద్ద ఫ్యామిలీస్ నుంచి వారసులు వరసగా పరిచయమయ్యారు. రెండు దశాబ్ధాల తర్వాత మూడు స్టార్ ఫ్యామిలీస్ నుంచి వారసులు రెడీ అవుతున్నారు. వాళ్ళ లాంఛింగ్ కోసం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మరి ఎవరు వాళ్లు..? ఎప్పుడొస్తున్నారు..?
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Mar 26, 2025 | 7:28 PM

టాలీవుడ్‌ను మెగా, నందమూరి, ఘట్టమనేని, దగ్గుబాటి కుటుంబాలు ఏలేస్తున్నాయి. అందులో అనుమానాలేం అవసరం లేదు. ఇప్పటికే రెండు తరాలు వచ్చేసాయి.. తాజాగా మూడో తరం వారసత్వం సిద్ధమవుతుంది.

మెగా కుటుంబం నుంచి అకీరా నందన్.. నందమూరి ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ.. ఘట్టమనేని కుటుంబం నుంచి గౌతమ్ సిద్ధమవుతున్నారు. ఫారెన్‌లో చదువుకుంటున్న మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.

దానికి కారణం ఆయన కాలేజ్‌లో చేసిన ఓ యాక్ట్. అందులో ఓ అమ్మాయితో కలిసి షార్ట్ ఫిల్మ్ చేసాడు గౌతమ్. ఈ వీడియో వైరల్ అవుతుందిప్పుడు. ఇది చూసాక.. ఘట్టమనేని వారసుడి ఎంట్రీ త్వరలోనే ఉంటుందేమో అనిపిస్తుంది.

ఇక పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సినిమా ఎంట్రీపై కూడా ఊహాగానాలు బాగానే వినిపిస్తున్నాయి. దీనికి కారణం గత కొన్నాళ్లుగా అకీరా పబ్లిక్‌లో బాగా ఎక్స్‌పోజ్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే అయ్యుండొచ్చు అని భావిస్తున్నారు.

మరోవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రశాంత్ వర్మతో ఈయన సినిమా ఉండబోతుంది. మొత్తానికి కాస్త అటూ ఇటూగా మెగా, నందమూరి, ఘట్టమనేని వారసులు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.





























