టాలీవుడ్ ఈ క్రేజీ బ్యూటీని పట్టించుకోవడం లేదా.? 

Rajeev 

03  march 2026

 ఐశ్వర్య రాజేష్.. ఇప్పుడు ఈ చిన్నదని పేరు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తుంది. ఒకే ఒక్క సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకుంది.

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోతుంది. 

 ఐశ్వర్య రాజేష్ తమిళ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అక్కడ వరుసగా సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.

ఐశ్వర్య రాజేష్ జనవరి 10, 1990లో చెన్నైలో జన్మించారు. ఆమె తండ్రి రాజేష్ 80వ దశకంలో తెలుగు చిత్రసీమలో స్టార్ హీరో. 

2010లో పంచ్ భరత్ దర్శకత్వం వహించిన “నీతనా అవన్” చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీతోనే సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

2017లో మలయాళంలో “జోమొండే సువిసెసమల్” ప్రధాన పాత్రలో నటించింది. ఆ తర్వాత వెట్రి మారన్ దర్శకత్వం వహించిన 2018 చిత్రం “వడ చెన్నై” తో హిట్ అందుకుంది. 

కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. ప్రస్తుతం తెలుగులో అంతగా అవకాశాలు అందుకోలేకపోతుంది.