AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Annadata Sukhibhava: ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు మీకు పడలేదా..? మార్చి 31లోగా ఈ పని చేస్తే అకౌంట్లోకి వచ్చేస్తాయి..

ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేసింది. మూడో విడత కింద రైతుల అకౌంట్లలో రూ.6 వేలు జమ చేసింది. ఇప్పటికే లబ్దిదారుల అకౌంట్లలో ఇవి జమ అయ్యాయి. అయితే కొంతమందికి జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అలాంటివారు ఏం చేయాలంటే..

Annadata Sukhibhava: 'అన్నదాత సుఖీభవ' డబ్బులు మీకు పడలేదా..? మార్చి 31లోగా ఈ పని చేస్తే అకౌంట్లోకి వచ్చేస్తాయి..
farmers
Venkatrao Lella
|

Updated on: Mar 15, 2026 | 1:21 PM

Share

ఏపీ ప్రభుత్వం మార్చి 13న పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.6 వేలను రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. పీఎం కిసాన్ కింద రూ.2 వేలు జమ కాగా.. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు జమ చేసింది. దీంతో ఏపీలోని రైతుల అకౌంట్లలో ఒకేసారి రూ.6 వేలు జమ అయ్యాయి. గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేశారు. ఇప్పటికే రైతుల బ్యాంక్ అకౌంట్లలో ఇవి జమ అయ్యాయి. అయితే అకౌంట్లలో నిధులు జమకానివారు ఆందోళన చెందుతున్నారు. అలాంటివారు ఈ పనులు చేయడం వల్ల డబ్బులు పొందవచ్చు.

కారణాలు ఇవే..

బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయి ఉండకపోవడం, బ్యాంక్ అకౌంట్ ఎన్‌పీసీఐ మ్యాప్ అయి ఉండకపోవడం, ఆధార్ ఈకేవైసీ పెండింగ్‌లో ఉండటం, భూమి రికార్డుల్లో తప్పులు ఉండటం వంటి కారణాలతో మీకు డబ్బులు ఆగిపోవచ్చు. ఇలాంటప్పుడు మీరు ఆ సమస్యలు పరిష్కరించుకోవడం వల్ల డబ్బులు తిరిగి పొందవచ్చు. ముందుగా గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి డబ్బులు జమ కాకపోవడానికి కారణం ఏంటనేది తెలుసుకోండి. అక్కడి అధికారులను అడిగితే కారణం ఏంటనేది చెబుతారు. ఇక రైతు సేవా కేంద్రానికి వెళ్లి కూడా వివరాలు అడగొచ్చు.

తప్పులు సరిచేసుకోండి

ల్యాండ్ వివరాల్లో తప్పులు ఉంటే మీరు మీ భూమి వెబ్ సైట్లోకి వెళ్లి చూసుకోండి. భూమి రికార్డుల్లో ఆధార్ వివరాలు సరిచేసుకోండి. తప్పులు ఉంటే ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి సరిచేసుకోండి. మార్చి 31లోగా మీరు తప్పులు సరిదిద్దుకుంటే డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. ఇక ఆధార్-బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండకపోతే బ్యాంక్‌కి వెళ్లి ఫామ్ 8 లేదా 11 తీసుకుని వివరాలు పూర్తి చేయండి. పీఎం కిసాన్ వెబ్ సైట్లోకి వెళ్లి లింక్ అయిందో.. లేదో తెలుసుకోండి. హెల్ప్ లైన్ నెంబర్ 155261కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక పీఎం కిసాన్ వెబ్ సైట్లోకి వెళ్లి ఈకేవైసీ యాక్టివ్‌లో ఉందా లేదా అనేది తెలుసుకోండి. లేకపోతే రైతు సేవా కేంద్రంలో అప్డేట్ చేయించుకోండి. ఇక బ్యాంక్ అకౌంట్‌తో ఎన్‌పీసీఐ యాక్టివ్ చేయించుకోండి. బ్యాంక్‌కి వెళ్లితే లింక్ చేస్తారు. ఇవి చేసినా మీకు డబ్బులు అందకపోతే 1902 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. ఈ పనులన్నీ చేయడం ద్వారా మీరు అన్నదాత సుఖీభవ డబ్బులను పొందగలుగుతారు. డబ్బులు పడని రైతులు ఈ పనులు వెంటనే చేయడం ద్వారా లబ్ది చేకూరుతుంది.

Follow Us