బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. లివింగ్ రిలేషన్‌ను వ్యతిరేకించినందుకు, ఆర్థిక లావాదేవీల కారణంగా శ్వేత అనే కూతురు తన తల్లిదండ్రులు, చెల్లిని అతి కిరాతకంగా చంపేసింది. ప్రియుడు కెన్నెత్ సహాయంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రూ.30 లక్షల అప్పులు, ఆస్తిపై ఆశ హత్యలకు దారి తీశాయని పోలీసులు వెల్లడించారు.