AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. స్మోకింగ్ చేస్తే భారీ జరిమానా.. జైలు శిక్ష !

రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. స్మోకింగ్ చేస్తే భారీ జరిమానా.. జైలు శిక్ష !

Phani CH
|

Updated on: Jun 24, 2026 | 11:33 AM

Share

రైళ్లు, రైల్వే స్టేషన్లలో క్రమశిక్షణ, ప్రయాణికుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. జన్ విశ్వాస్ చట్టం-2026 కింద ధూమపానం, అనధికారిక వ్యాపారాలు, భిక్షాటన వంటి చర్యలకు రూ.2,000 జరిమానా విధించనుంది. జరిమానా చెల్లించకపోతే కోర్టు చర్యలు, జైలు శిక్షలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.

రైలు ప్రయాణికుల రక్షణ, సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం రైల్వే నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కొత్తగా తీసుకొచ్చిన ‘జన్ విశ్వాస్ చట్టం-2026’ కింద రూపొందించిన నిబంధనలు జూన్ 19 నుంచి తక్షణమే అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం రైళ్లు, రైల్వే ప్రాంగణాలలో ధూమపానం, అనధికారిక వ్యాపారాలు, భిక్షాటన చేయడాన్ని తీవ్రమైన నేరాలుగా పరిగణించనున్నారు. గతంలో ఉన్న ధూమపానానికి ఉన్న రూ.100 జరిమానాను ఏకంగా రూ.2,000కు పెంచారు. స్మోకింగ్ చేస్తూ దొరికితే టికెట్ రద్దు చేసి, తదుపరి స్టేషన్‌లోనే రైలు నుంచి దింపేస్తారు. ఒకవేళ అక్కడికక్కడే జరిమానా చెల్లించకపోతే కోర్టు ముందు హాజరుపరుస్తారు, అక్కడ నేరం రుజువైతే గరిష్టంగా రూ.5,000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది. మరోవైపు సెక్షన్ 144 కింద రైల్వే లైసెన్స్ లేకుండా రైళ్లలో తిరుగుతూ వ్యాపారం చేసే హ్యాకర్లు, భిక్షాటన చేసే వారిపై పూర్తి నిషేధం విధించారు. వీరికి కూడా రూ.2,000 జరిమానా విధిస్తారు. ఒకవేళ వీరు జరిమానా కట్టని పక్షంలో కోర్టు ద్వారా 3 నెలల వరకు జైలు శిక్ష, రూ.5,000 ఫైన్ లేదా ఈ రెండూ విధించేలా చట్టాన్ని సవరించారు. ఇక పదే పదే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ దొరికిపోతే కనీసం 3 నెలల నుంచి గరిష్టంగా ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. క్రిమినల్ ప్రాసిక్యూషన్‌తో సంబంధం లేకుండా, సివిల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ చర్యల ద్వారా అప్పటికప్పుడే జరిమానాలు వసూలు చేసే పూర్తి అధికారాలను రైల్వే అధికారులకు కేంద్రం కల్పించింది. ఫలితంగా త్వరలోనే రైల్వే స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం కానున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్‌పాట్‌.. ఒకే సారి మూడు భారీ చేపలు.. ధరతెలిస్తే షాకవుతారు

Samantha: ‘నా బిడ్డే నా ప్రపంచం..’ పుట్టబోయే బిడ్డపై సమంత ఎమోషనల్ కామెంట్స్

నవ్వుల వెనుక దాగిన విషాదం.. మిమిక్రీ మూర్తి చివరి రోజులు దారుణం!

‘చావు అంచున ఉన్నాను.. నన్ను కాపాడండి’..

పెద్ది గాడి OTT ఎంట్రీ.. డేట్ ఫిక్స్? గెట్ రెడీ…!

Follow Us