వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్‌పాట్.. ఒకే సారి మూడు భారీ చేపలు.. ధరతెలిస్తే షాకవుతారు
రెండు నెలల వేట విరామం అనంతరం సముద్రంలోకి వెళ్లిన కోనసీమ మత్స్యకారులకు అరుదైన అదృష్టం కలిసొచ్చింది. అంతర్వేది సముద్రంలో ఒకేసారి మూడు కచిడి చేపలు వలకు చిక్కాయి. హార్బర్‌లో నిర్వహించిన వేలంలో ఈ చేపలు రూ.1.5 లక్షలకు అమ్ముడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఈ చేపల వాయు సంచికి ఔషధ, వైద్య రంగాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రెండు నెలల సుదీర్ఘ వేట విరామం తర్వాత సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు తొలిరోజే అదృష్టం వరించింది. అంతర్వేది సముద్ర తీరంలో ఒకేసారి మూడు అరుదైన ‘కచిడి’ చేపలు మత్స్యకారుల వలకు చిక్కాయి. అంతర్వేది పల్లిపాలెం మినీ హార్బర్‌కు తీసుకొచ్చిన ఈ చేపలను చూసేందుకు స్థానికులు, తోటి మత్స్యకారులు భారీగా తరలివచ్చారు. హార్బర్‌లో నిర్వహించిన బహిరంగ వేలంలో ఈ మూడు చేపలను ఒక స్థానిక వ్యాపారి భారీ ధరకు కొనుగోలు చేశాడు. ఈ చేపలకోసం ఆయన ఏకంగా లక్షన్నర ఖర్చుపెట్టాడు. స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం.. వలకు చిక్కిన వాటిలో దాదాపు 12 నుంచి 13 కిలోల బరువున్న రెండు మగ చేపలు, ఒక ఆడ చేప ఉన్నాయి. ఈ కచిడి చేపలకు అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఈ చేపల పొట్ట భాగంలో ఉండే ‘వాయు సంచి’ ని వైద్య రంగంలో శస్త్రచికిత్సకు ఉపయోగించే దారాలు, అలాగే..పలు రకాల ప్రాణరక్షక ఔషధాల తయారీలో ముడిసరుకుగా ఉపయోగిస్తారు. వీటి పరిమాణం ఇంకా పెద్దదిగా ఉంటే, ఒక్కో చేప రూ.2 లక్షల నుండి రూ.3 లక్షల వరకు పలుకుతుందని స్థానికులు చెబుతున్నారు. వేట ప్రారంభమైన తొలిరోజే అరుదైన, ఖరీదైన చేపలు పడటంతో కోనసీమ మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: ‘నా బిడ్డే నా ప్రపంచం..’ పుట్టబోయే బిడ్డపై సమంత ఎమోషనల్ కామెంట్స్
నవ్వుల వెనుక దాగిన విషాదం.. మిమిక్రీ మూర్తి చివరి రోజులు దారుణం!
‘చావు అంచున ఉన్నాను.. నన్ను కాపాడండి’..
వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్‌పాట్.. ఒకే సారి
రాత్రివేళ ఒంటరిగా క్యాబ్‌లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి
బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!
ఇంట్లో కూలర్ ఆన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!
చిన్న పామే కదా అని ఆటలాడాడు.. చివరికి ఇలా..
కస్టమర్లా వచ్చాడు.. షాపులో ఒంటరిగా ఉన్న మహిళను అదను చూసి..

