AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చావు అంచున ఉన్నాను.. నన్ను కాపాడండి’..

‘చావు అంచున ఉన్నాను.. నన్ను కాపాడండి’..

Phani CH
|

Updated on: Jun 24, 2026 | 11:16 AM

Share

టాలీవుడ్ నటి Gayatri Gupta ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో తన మానసిక ఆరోగ్య సమస్యల గురించి భావోద్వేగంగా మాట్లాడారు. పానిక్ అటాక్స్, తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు వెల్లడిస్తూ సహాయం అవసరమని పేర్కొన్నారు. అనంతరం ఆ వీడియోను తొలగించడం చర్చనీయాంశమైంది. ఆమె ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ మద్దతు తెలుపుతున్నారు.

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది గాయత్రి గుప్తా. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ సాయి పల్లవికి ఫ్రెండ్ గా నటించింది. దీంతో పాటు కొబ్బరి మట్ట, ఐస్ క్రీమ్, అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్ తదితర సినిమాలు, వెబ్ సిరీసుల్లో యాక్ట్ చేసింది. అయితే సినిమాలతో పాటు ఇతర విషయాలతోనూ వార్తల్లో నిలిచింది గాయత్రి. ముక్కు సూటిగా, ధైర్యంగా మాట్లాడే తత్వమున్న ఆమె కొందరు ప్రొడ్యూసర్లు తనను లైంగికంగా వేధించారంటూ సంచలన స్టేట్మెంట్స్ ఇచ్చింది. అలాగే సోషల్ మీడియాలోనూ బోల్డ్ వీడియోస్ పెట్టి షాకులు ఇస్తుంటుంది. తాజాగా ఆమె మరో సంచలన వీడియోను పోస్ట్ చేసింది. ‘గత కొన్ని నెలలుగా నాకు తీవ్రమైన పానిక్ అటాక్ వస్తోంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయి. అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నేను ప్రస్తుతం లైంగిక వేధింపుల వల్ల కలిగిన తీవ్రమైన మానసిక గాయంతో బాధపడుతున్నాను. నాకు సాయం కావాలి. నేను థెరపీ తీసుకోవడానికి బాగా ప్రయత్నిస్తున్నాను, కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. వాయిస్ ఆఫ్ ఉమెన్ వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎవరిని ఆశ్రయించాలో, ఏం చేయాలో నాకు తెలియడం లేదు. నన్ను ఆదుకోవడానికి ఎవరో ఒకరు కావాలి. చావు అంచున ఉన్న నన్ను నేను కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గం.. ఎవరితోనైనా మాట్లాడి సహాయం పొందడమే. నా వ్యక్తిగత జీవితంలో సహాయం కోసం ప్రయత్నించాను, కానీ ఎక్కడా ఎలాంటి సాయం దొరకలేదు. ఏదైనా చేయడానికి నాకు ఒక లాయర్ అవసరమా? లేదా థెరపిస్ట్ అవసరమా? అనేది నాకు తెలియదు’ ‘ఇప్పుడు కూడా నేను తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాను. సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. సహాయం ఎక్కడ దొరుకుతుందో, ఎలా దొరుకుతుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నాకు అది చాలా అవసరం. అండగా ఉంటాం, తోడుగా ఉంటాం అని సోషల్ మీడియాలో చెప్పే డ్రామాలు, మాటలు కోకొల్లలు.. కానీ నిజానికి ఎవరికీ ఏమాత్రం పట్టదు. పైకి మాత్రం తాము పట్టించుకుంటున్నట్లు నటిస్తారు. ఎవరికీ నిజంగా నా మీద శ్రద్ధ లేదు’ అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చింది గాయత్రి. అయితే ఏమైందో తెలియదు కానీ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే డిలీట్ కొట్టేసిందీ టాలీవుడ్ నటి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెద్ది గాడి OTT ఎంట్రీ.. డేట్ ఫిక్స్? గెట్ రెడీ…!

OTT గైడ్ ఈ ఒక్కవారం ఓటీటీల్లో 21 మూవీస్..

బ్లాక్‌ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం

భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఇది!

ఇంట్లో కూలర్‌ ఆన్‌ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

Follow Us