AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఇది!

భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఇది!

Phani CH
|

Updated on: Jun 24, 2026 | 10:53 AM

Share

ఈజిప్టు పిరమిడ్లు వేల ఏళ్లుగా భూకంపాలను తట్టుకుని ఎలా నిలిచి ఉన్నాయనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు. పిరమిడ్ల ప్రత్యేక నిర్మాణం, అంతర్గత గదుల అమరిక, గ్రానైట్ శిలల్లోని క్వార్ట్జ్ స్ఫటికాలు భూకంప ప్రకంపనల ప్రభావాన్ని తగ్గిస్తున్నాయని పరిశోధనలు వెల్లడించాయి. ఆధునిక ఇంజినీరింగ్‌ను సైతం ఆశ్చర్యపరిచే ఈ నిర్మాణ రహస్యాలు ప్రాచీన ఈజిప్టు నాగరికత గొప్పతనాన్ని మరోసారి చాటుతున్నాయి.

ప్రపంచంలోని గొప్ప కట్టడాల్లో ఈజిప్టు పిరమిడ్లు ముఖ్యమైనవి. ఇవి ప్రపంచ వింతల్లో కూడా ఒకటి. ప్రాచీన, మధ్య యుగపు ఈజిప్టు నాగరికతలకు ఇవి ప్రతిబింబంగా నిలిచిపోయాయి. గ్రేట్‌ గిజా పిరమిడ్‌లో పరిశోధకులు భారీ సొరంగాన్ని కనుగొన్నారు. వాటిలో ఈజిప్టు రాజుల మృతదేహాలను సమాధి చేశారు. పిరమిడ్ల తో పాటు, “స్ఫినిక్స్” రాతి శిల్పాన్ని సూర్య దేవునిగా భావించి, పూజ చేయడం, ఆరాధించడం ఈజిప్షియన్ల ఆచారం. మనుషుని తల, మిగిలిన శరీర భాగం సింహం ఆకృతిలో ఉంటాయి. ఈ స్ఫినిక్స్ ను ఎడారిలోని ఒక ఏకశిల కొండరాతిలో చెక్కారు. పిరమిడ్ల నిర్మాణానికి 1000 సంవత్సరాలు పట్టి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. పిరమిడ్ల రహస్యాలను ఛేదించేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. 4500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న పిరమిడ్లు భారీ భూకంపాలను తట్టుకుని ఎలా నిలబడగలిగాయి? 1992లో సంభవించిన 5.8 తీవ్రత గల భూకంపం వల్ల వీటి వెలుపలి భాగం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, వీటి ప్రధాన కేంద్రం మాత్రం చెక్కుచెదరలేదు. శాస్త్రవేత్తలను వేధిస్తున్న ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. పరిశోధకులు స్పెక్ట్రల్ రేషియో అనాలసిస్ పద్ధతిని ఉపయోగించి సూక్ష్మ వైబ్రేషన్లను నమోదు చేశారు. భూకంపం వచ్చినప్పుడు నేల ఫ్రీక్వెన్సీ, కట్టడం ఫ్రీక్వెన్సీతో సరిపోలితే ‘రెజోనెన్స్’ ఏర్పడి కట్టడాలు కూలిపోతాయి. అయితే ఇక్కడ ఫ్రీక్వెన్సీ పూర్తిగా భిన్నంగా ఉండటం వల్ల భూకంప శక్తి పిరమిడ్ లోపలికి బదిలీ కాలేకపోతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా అంతర్గత నిర్మాణాలు భూకంప ప్రకంపనల తీవ్రతను తగ్గించే షాక్ అబ్జార్బర్లుగా పనిచేస్తున్నాయని తేల్చారు. ముఖ్యంగా పిరమిడ్ లోపల ఉండే ‘కింగ్స్ ఛాంబర్’.. పై భాగంలో అమర్చిన ప్రత్యేక గదులు వైబ్రేషన్లను భారీగా తగ్గిస్తున్నట్లు తేలింది. పిరమిడ్ నిర్మాణంలో ఉపయోగించిన గ్రానైట్ శిలల్లో ఉండే క్వార్ట్జ్ స్ఫటికాలు భూకంప తరంగాలను శోషించుకోకుండా తిరిగి పరావర్తనం చెందేలా చేస్తాయనీ గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లో కూలర్‌ ఆన్‌ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

దంచికొడుతున్న ఎండలు.. అయినా జనాల్లో డి విటమిన్‌ లోపం.. కారణమేంటి?

Follow Us