AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో కూలర్‌ ఆన్‌ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

ఇంట్లో కూలర్‌ ఆన్‌ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

Phani CH
|

Updated on: Jun 24, 2026 | 10:51 AM

Share

ఎండల తీవ్రతతో చల్లని ప్రదేశాల కోసం పాములు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటి కూలర్ లోపల భారీ పాము దాక్కున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కూలర్ ఆన్ చేసే ముందు తనిఖీ చేయడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. నిపుణులు ఇలాంటి సందర్భాల్లో స్వయంగా ప్రయత్నించకుండా స్నేక్ రెస్క్యూ బృందాలను సంప్రదించాలని సూచిస్తున్నారు.

జూన్‌ వచ్చినా దేశంలో ఎండ తీవ్రత తగ్గలేదు. ఇంకా ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. దీంతో చల్లదనం కోసం వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తూ.. ఎక్కడ పడితే అక్కడ తిష్టవేస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ భయానక వీడియో నెటిజన్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎండ వేడిమి తట్టుకోలేక కూలర్ ఆన్ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తికి, ఆ కూలర్ లోపల కనిపించిన దృశ్యం చూసి గుండె ఆగినంత పనైంది! కూలర్ ఆన్ చేయకుండానే లోపల నుండి ఏవో వింత శబ్దాలు రావడంతో అనుమానమొచ్చి యజమాని దాన్ని తెరిచి చూశాడు. అంతే.. ఎదురుగా ఉన్న దృశ్యానికి అతని గుండె గుభేల్‌ అంది. కూలర్ లోపల ఫ్యాన్ బ్లేడ్‌లు, వైర్ల మధ్య పసుపు రంగులో మెరుస్తూ, నల్లటి మచ్చలతో ఉన్న ఒక భారీ పాము చుట్టుకుని ఉంది. చిన్నపాటి నిర్లక్ష్యంతో కూలర్ స్విచ్ ఆన్ చేసినా.. చేతితో తాకి ఉన్నా ఆ పాము కాటుకు అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. వేసవి కాలంలో చల్లదనం కోసం పాములు ఇలా కూలర్లు, వాహనాలు, ఏసీ పైపుల్లోకి చేరి ఆవాసాలు ఏర్పరచుకుంటున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు భయంతో వణికిపోతున్నారు. “ఇకపై కూలర్ ముట్టుకోవాలంటేనే భయమేస్తోంది బాబోయ్.. ఆన్ చేసే ముందు వందసార్లు చెక్ చేయాలి” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సొంత ప్రయోగాలు చేయకుండా వెంటనే స్నేక్ రెస్క్యూ టీమ్‌ను పిలవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ ఇంట్లో కూలర్ ఆన్ చేసే ముందు కాస్త జాగ్రత్త సుమా!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దంచికొడుతున్న ఎండలు.. అయినా జనాల్లో డి విటమిన్‌ లోపం.. కారణమేంటి?

Follow Us