AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూకంపాలతో చిగురుటాకులా వణికిన వెనిజులా.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం

వెనిజులాలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు దేశాన్ని తీవ్రంగా వణికించాయి. అనంతరం నమోదైన 20కిపైగా ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనేక భవనాలు కూలిపోగా, భారీ ప్రాణనష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించింది.

భూకంపాలతో చిగురుటాకులా వణికిన వెనిజులా.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
Venezuela Earthquake
Ram Naramaneni
|

Updated on: Jun 25, 2026 | 9:39 AM

Share

వెనిజులాలో బుధవారం వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు దేశాన్ని తీవ్రంగా వణికించాయి. భూకంపాల తర్వాత 20కిపైగా ప్రకంపనలు నమోదవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనేక భవనాలు కూలిపోగా, భారీ ప్రాణనష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

నిమిషం వ్యవధిలో రెండు భారీ భూకంపాలు

అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం మధ్యాహ్నం రాజధాని కారకాస్‌కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత నిమిషం లోపే అదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం నమోదైంది.

కూలిన భవనాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

భూకంపాల ప్రభావంతో అనేక భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. గాయపడిన వారి సంఖ్య, మృతుల సంఖ్యపై ప్రభుత్వం ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

విమానాశ్రయం మూసివేత.. పాఠశాలలకు సెలవులు

భూకంపాల కారణంగా మైక్వెటియాలోని సిమోన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నష్టం వాటిల్లింది. దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మరమ్మతుల పనులు పూర్తయ్యే వరకు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు అంతరాయం కలిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాలలకు కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

భారీ ప్రాణనష్టం ఉండొచ్చన్న అంచనా

అమెరికా భూగర్భ సర్వే సంస్థ ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ భూకంపాల వల్ల భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం.. 10 వేల నుంచి లక్ష మంది మధ్య మృతులు ఉన్నట్లు సమాచారం.  పరిస్థితిని అంచనా వేయడానికి అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. మరోవైపు వరుస ప్రకంపనలు కొనసాగుతుండటంతో దెబ్బతిన్న భవనాలు మరింత కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

వెనెజులా ప్రజలకు మాజీ అధ్యక్షుడు మదురో సంఘీభావం తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్‌ జైలు నుంచి వెనెజులా ప్రజలకు సందేశం పంపారు. అందరూ ఐక్యంగా, సంఘీభావంతో ఉండాలని.. సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని మదురో పిలుపునిచ్చారు.

Follow Us
రూ. 1 లక్షను రూ. 87 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్..
రూ. 1 లక్షను రూ. 87 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్..
కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన..
కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన..
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా?ప్రాణాలు తీసే తప్పుఇదే
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా?ప్రాణాలు తీసే తప్పుఇదే
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
సుకన్య పథకంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన రూల్స్!
సుకన్య పథకంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన రూల్స్!
టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్
టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్
'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
డెయిరీల్లోకి చేరిన కెమికల్.. వెలుగులోకి షాకింగ్ పాల స్కామ్..!
డెయిరీల్లోకి చేరిన కెమికల్.. వెలుగులోకి షాకింగ్ పాల స్కామ్..!
మీకంటే బెగ్గర్స్ బెటర్.. 104 కోట్లు దోచేసిన ఏసీ కోచ్ ప్రయాణికులు
మీకంటే బెగ్గర్స్ బెటర్.. 104 కోట్లు దోచేసిన ఏసీ కోచ్ ప్రయాణికులు
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం