AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టు 7 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు.. మీ రాశికి ఎలా ఉందంటే?

Rashi Phalalu (August 7, 2026): శుక్రవారం గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ విషయాల్లో శుభ ఫలితాలు కనిపించనున్నాయి. మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగగా, వృషభ రాశి వారికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. అలాగే 12 రాశుల వారికి ఈ రోజు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

ఆగస్టు 7 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు.. మీ రాశికి ఎలా ఉందంటే?
Horoscope Today 07 August 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 07, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (ఆగస్టు 7, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా పురోగతి ఉంటుంది. మిథున రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక, వ్యవహారాలన్నీ పూర్తవుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. ఇంటా బయటా బరువు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్య మైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆహార, విహారాల్లో అశ్రద్ధ కారణంగా ఆరోగ్యానికి ఇబ్బంది ఏర్పడవచ్చు. వాహనాలను వేగంగా నడపకపోవడం మంచిది. కుటుంబ జీవితం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు, ప్రతిఫలం కూడా లభి స్తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. సమా జంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యక్తిగతంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొద్దిపాటి వ్యయప్రయాసలతో చక్కబడతాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. పని భారం ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నప్ప టికీ వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు అత్యధి కంగా లబ్ధి పొందుతారు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. కొద్దిగా ఆలస్యంగానే అయి నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ చాలావరకు పూర్తవుతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లో చిన్నపాటి ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆస్తి, ఆర్థిక, కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా పురోగమిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబ వ్యవహారాలకు సంబం ధించి ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బాగా బిజీ అవుతారు. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. దాంపత్య జీవితంలో అనుకూలతలు పెరు గుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగుల మీద అదనపు బాధ్యతల భారం ఉంటుంది. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు తగ్గే సూచనలున్నాయి. వ్యయ ప్రయాసలతో కానీ ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి కాకపోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో పని భారం బాగా ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేస్తారు. ఆస్తి కొనుగోలు వ్యవహారంపై దృష్టి పెడతారు. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి తేలికగా పరిష్కారం అవుతుంది. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి కేంద్రీకరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు అనుకూలమైన వాతావరణం ఉంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

Follow Us