శివలింగానికి విభూతితో అభిషేకం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసా?

November 18, 2026

Rajashekher

శివలింగానికి అభిషేకం ప్రారంభించే ముందు పంచబ్రహ్మ మంత్రాలను పఠిస్తూ పొడి విభూతిని స్వామివారికి సమర్పిస్తారు. ఇలా చేయడం శివారాధనలో విశేషమైన క్రతువుగా భావిస్తారు.

పంచబ్రహ్మ మంత్రాలతో విభూతి సమర్పణ:

బ్రహ్మాండంలోని సమస్త వృక్షాల పూలను సేకరించి ఈశ్వరుడికి పూజ చేసినంతటి పుణ్యఫలం పొడి విభూతితో అభిషేకం చేసిన వారికి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పుష్పార్చన చేసిన ఫలితం:

విభూతిని నీటితో తడిపి శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇలా అభిషేకం చేసినప్పుడు శివలింగంపై నుంచి కిందకు జారే తెల్లటి విభూతి ధారతో భక్తుల పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక విశ్వాసం.

పాపాల నుంచి విముక్తి:

శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత కిందకు జారిన విభూతిని నుదుటిపై ధరించడం వల్ల అపారమైన తేజస్సు కలుగుతుందని చెబుతారు. మనస్సు కూడా ఈశ్వరుడి వైపు మళ్లుతుందని భక్తుల నమ్మకం.

అపారమైన తేజస్సు: 

స్కాందపురాణంలోని బ్రహ్మోత్తర ఖండంలో విభూతి మహిమను తెలిపే ఒక ఆసక్తికరమైన కథ ఉంది. విభూతి ధరించిన వ్యక్తిని పట్టుకున్న బ్రహ్మరాక్షసుడికి సైతం శాపవిమోచనం కలిగినట్లు పురాణ కథనం వివరిస్తుంది.

బ్రహ్మరాక్షసుడికి శాపవిమోచనం:

 భక్తితో, ఉపాసనా బలంతో విభూతిని ధరించిన వ్యక్తి పరమశివుడి ఆశీర్వాద బలంతో ప్రకాశిస్తాడని ఆధ్యాత్మిక పెద్దలు చెబుతారు. అందుకే భస్మధారణకు శైవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది.

శివుడి అనుగ్రహానికి ప్రతీక:

 శాస్త్రాల ప్రకారం భస్మం రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది మహాప్రళయ సమయంలో ఏర్పడే భస్మం. రెండోది మనం నిత్య జీవితంలో ఉపయోగించే లౌకిక భస్మం.

భస్మం రెండు రకాలు:

ఆవు పేడను కాల్చడం ద్వారా లౌకిక భస్మాన్ని తయారు చేస్తారు. ఈ భస్మాన్ని శుద్ధి చేసి విభూతిగా ఉపయోగిస్తారు. శ్రీశైలం దేవస్థానంలో కూడా ఈ విభూతిని పలకల రూపంలో భక్తులకు అందిస్తారు. ఆవు పేడతో తయారయ్యే భస్మం శివారాధనలో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.

ఆవు పేడతో తయారయ్యే విభూతి: