యాదాద్రి జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుతూ కప్పతల్లి కావడి ఆటను నిర్వహించారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ప్రకృతి మాత కరుణ కోసం నమిల, దిలావర్ పూర్ గ్రామాల్లో కప్పతల్లి ఊరేగింపు జరిపి, నీళ్లు చల్లుకుంటూ వర్షాల కోసం ప్రార్థించారు.