AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పెరగనున్న ఆహార ధరలు.. సామాన్యుడి బడ్జెట్‌కు తప్పని గండం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పెరగనున్న ఆహార ధరలు.. సామాన్యుడి బడ్జెట్‌కు తప్పని గండం!

Phani CH
|

Updated on: Jun 24, 2026 | 11:45 AM

Share

ఎల్‌నినో ప్రభావంతో దేశంలో రుతుపవనాలు బలహీనపడే ప్రమాదం నెలకొంది. వర్షాల కొరత కారణంగా పంటల దిగుబడులు తగ్గే అవకాశం ఉండటంతో కూరగాయలు, ధాన్యాల ధరలు మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వర్షపాతం లోటు నమోదవగా, ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభావం రైతుల నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకు అందరిపైనా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒకప్పుడు దేశంలో నైరుతి రుతుపవనాల రాకను పండగలా స్వాగతించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రుతుపవనాల ఆలస్యం లేదా బలహీనత కేవలం రైతులను మాత్రమే కాదు.. దేశ ఆహార ధరలు, ద్రవ్యోల్బణం, విద్యుత్ బిల్లులు, చివరికి రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలను కూడా శాసిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ‘ఎల్‌నినో’ పరిస్థితులు సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేయనున్నాయని ఆర్థిక, వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల దేశంలో బలహీనమైన రుతుపవనాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, తమిళనాడు సహా 12 రాష్ట్రాల్లో వర్షపాతంలో తీవ్ర లోటు కనిపిస్తోంది. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా దిగుబడులు తగ్గి టమోటో, పచ్చిమిర్చి, క్యాబేజీ వంటి కూరగాయల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. రానున్న రోజుల్లో ఉల్లిపాయలు, బంగాళాదుంపల ధరలపై కూడా ఈ ఒత్తిడి పడనుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, వాతావరణ మార్పుల వల్ల ఆహార ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని బ్రోకరేజ్ సంస్థ ‘బీఎన్‌సీ పారిబాస్’ పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే రిజర్వ్ బ్యాంక్ తన ద్రవ్యోల్బణ అంచనాను 4.6 శాతం నుంచి ఏకంగా 5.1 శాతానికి పెంచింది. భారతదేశంలో సాగుభూమిలో సగానికి పైగా కేవలం వర్షాలపైనే ఆధారపడి ఉంది. తక్కువ వర్షాల వల్ల నేలలో తేమ తగ్గి, విత్తనాలు చల్లడం ఆలస్యమవుతోంది. ఫలితంగా వరి, పప్పుధాన్యాలు, పత్తి, చెరకు వంటి కీలక ఖరీఫ్ పంటల ఉత్పాదకత దెబ్బతినే ప్రమాదం ఉంది.’360 వన్ క్యాపిటల్ రీసెర్చ్’ నివేదిక ప్రకారం, రుతుపవనాల ఆలస్యం వల్ల జూన్ 12 నాటికి దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు విస్తీర్ణం 84.6 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 3.9 శాతం తక్కువ. వర్షాలు లేక రైతులు భూగర్భ జలాలపై ఆధారపడటంతో డీజిల్, విద్యుత్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ ఎల్‌నినో ప్రభావం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శేషాచలం అడవుల్లో పురావస్తు శాఖ అధికారులు.. శతాబ్దాల నాటి రహస్యాలు వెలుగులోకి!

అమ్మదొంగా.. నువ్వు మామూలోడివి కాదురోయ్‌.. ముక్కంటి హుండీకే కన్నమా?

రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. స్మోకింగ్ చేస్తే భారీ జరిమానా.. జైలు శిక్ష !

వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్‌పాట్‌.. ఒకే సారి మూడు భారీ చేపలు.. ధరతెలిస్తే షాకవుతారు

Samantha: ‘నా బిడ్డే నా ప్రపంచం..’ పుట్టబోయే బిడ్డపై సమంత ఎమోషనల్ కామెంట్స్

Follow Us