AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహా స్కెచ్‌ అంటే నీదే బాస్‌.. అప్పు తీర్చడానికి ఏం ప్లాన్‌ చేసాడు..!

ఆహా స్కెచ్‌ అంటే నీదే బాస్‌.. అప్పు తీర్చడానికి ఏం ప్లాన్‌ చేసాడు..!

Phani CH
|

Updated on: Aug 03, 2026 | 8:05 AM

Share

నిజామాబాద్‌లో అప్పు తీర్చేస్తానంటూ బంగారం పేరుతో బంగారం పూత పూసిన కంకర రాళ్లు ఇచ్చి ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. రూ.1.30 లక్షల అప్పుతో పాటు అదనంగా రూ.32 వేలు తీసుకుని గుప్తనిధిలో దొరికిన బంగారం అంటూ నమ్మించాడు. ఇంటికి వెళ్లి పరిశీలించగా అవి నకిలీ రాళ్లని తేలడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారా..అప్పుగా జమకట్టుకోమని ఎవరైనా బంగారం ఇస్తామన్నారా.. అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి.. ఆ తర్వాత మీరే నిర్ణయించుకోండి.. ఆ బంగారం తీసుకోవాలా..వద్దా అని. అసలు ఈ కథంతా ఎందుకూ.. అసలు స్టోరీ ఏంటో చెప్పు అంటారా…ఓ వ్యక్తిని అప్పు ఇచ్చిన అతను డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాడు. అందుకు సదరు వ్యక్తి అతనికి కొంత బంగారం ఇచ్చాడు.. అది చూసి ఆనందంతో మురిసిపోయాడు అప్పు ఇచ్చిన వ్యక్తి .. అయితే ఆనక అసలు విషయం తెలిసి లబోదిబోమన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని హమాల్‌వాడీకి చెందిన రమేష్ వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి రూ. 1.30 లక్షల అప్పు తీసుకున్నాడు. ఇచ్చిన బాకీ తిరిగి చెల్లించాలని రమేష్ తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో శ్రీనివాస్ ఒక కొత్త నాటకానికి తెరతీశాడు. తనకు గుప్తనిధులు దొరికాయని, అందులో బంగారు రాళ్లు ఉన్నాయని నమ్మబలికాడు. అప్పు కింద ఆ రాళ్లను ఇస్తానని, మరో రూ. 32 వేలు అదనంగా తీసుకొని డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ రావాలని రమేష్‌కు సూచించాడు. ఇది నిజమేనని నమ్మిన రమేష్ డబ్బుతో అక్కడికి వెళ్లగా, శ్రీనివాస్ అతని చేతిలో నాలుగు బంగారు రంగు రాళ్లను పెట్టాడు. ఇంటికి వచ్చిన రమేష్‌కి ఎందుకో అనుమానం వచ్చి..ఆ రాళ్లను క్షుణ్ణంగా పరిశీలించాడు. అవి బంగారం పూతపూసిన కంకర రాళ్లుగా తేలింది. తాను తీవ్రంగా మోసపోయానని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ డిచ్‌పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ కొత్త రూల్స్‌ తెలుసుకోకపోతే నష్టమే!

Follow Us