మహారాష్ట్రలోని లోహగడ్ కోట వద్ద జరిగిన కేతన్ అగర్వాల్ మృతి కేసులో పూణే పోలీసులు సంచలన నిజాలు వెలికితీశారు. సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయాడనుకున్న ఈ కేసు.. వధువు సియా గోయల్ తన రహస్య ప్రియుడితో కలిసి పథకం ప్రకారం చేసిన హత్య అని తేలింది. పెళ్లి ఇష్టం లేక ఈ దారుణానికి ఒడిగట్టింది.