హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ హత్యను తీవ్రంగా ఖండించారు. ఈ దాడి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని అభిప్రాయపడ్డారు. యుద్ధం వల్ల సామాన్యులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ, పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని డిమాండ్ చేశారు. యుద్ధం కొనసాగితే చమురు ధరలు పెరుగుతాయని ఆయన హెచ్చరించారు.