Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..
తెలుగు సినీరంగంలో చైల్డ్ ఆర్టి్స్టుగా ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కథానాయికగా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. శ్రీకాంత్, పవన్ కళ్యాణ్, రాజశేఖర్, జగపతి బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించిన తెలుగు ప్రజల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు బుల్లితెరపై అత్తగా, అమ్మ పాత్రలలో కనిపిస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆమె స్టార్ హీరోయిన్. బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. అందం, అభినయంతో కుర్రకారును ఊర్రుతలూగించింది. తక్కువ సమయంలోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్, శ్రీకాంత్, జగపతి బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత విలన్ పాత్రలలోనూ అదరగొట్టింది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఓ సినిమాలో పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ లో అదరగొట్టింది. అటు పవన్ కళ్యాణ్ భార్యగా కనిపించిన ఈ హీరోయిన్.. అ తర్వాత మహేష్ సినిమాలో విలన్ గా కనిపించి ప్రేక్షకులకు ఒక్కసారిగా షాకిచ్చింది. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్లలో అత్తగా, అమ్మగా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ రాశి.
తెలుగు సినిమాల్లో ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో రాశి ఒకరు. అటు ఫ్యామిలీ అడియన్స్.. ఇటు యూత్ ఎక్కువగా ఇష్టపడే హీరోయిన్ ఆమె. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత కథానాయికగా సత్తా చాటింది. సంప్రదాయ లుక్ లో కనిపిస్తూనే అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ మీకు తెలుసా.. పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా కనిపించిన రాశి.. ఆ తర్వాత మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్రలో కనిపించింది.
పవన్ కళ్యాణ్, రాశి కాంబోలో గోకులంలో సీత అనే సినిమా వచ్చింది. ముత్యలా సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టింది. ఇందులో గోపిచంద్ భార్యగా కనిపించింది. హీరోయిన్ గా కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. నెగిటివ్ రోల్ లో ఊహించని విధంగా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న రాశి.. ఇప్పుడు బుల్లితెరపై బిజీగా ఉంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..