- Telugu News Photo Gallery Cinema photos Vaishnavi Chaitanya Says Actor Ram Pothineni Is Her First Crush
Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్
బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఆ తర్వాత లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం జాక్ చిత్రంలో నటిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీని డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు.
Updated on: Apr 06, 2025 | 12:19 PM

ప్రస్తుతం జాక్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది హీరోయిన్ వైష్ణవి చైతన్య. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య.

కూచిపుడి, పాశ్చాత్య నృత్యంలో తనకు ప్రావీణ్యం ఉందని.. పాటలు కూడా బాగా పాడతానని చెప్పుకొచ్చింది. గంగూబాయి కతియావాడి సినిమాలో అలియా భట్ నటకు ఫిదా అయ్యానని.. అలాంటి పాత్రలు వస్తే.. ఎంత కష్టమైన నటించేందుకు రెడీ అని తెలిపింది.

స్కూల్లో తనకు చాలా క్రష్ లు ఉండేవని.. పూర్తిస్థాయి రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టింది మాత్రం పద్దెనిమిదేళ్ల వయుసలోనే అని తెలిపింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తమ బంధం ముందుకు వెళ్లలేకపోయిందని.. కానీ ఫస్ట్ లవ్ ఎప్పటికీ సమ్ థింగ్ స్పెషల్ అని చెప్పుకొచ్చింది.

అలాగే తన ఫస్ట్ క్రష్ హీరో రామ్ పోతినేని అని తెలిపింది. అబ్బాయిల్లో మొదటగా అతడి కళ్లు, నవ్వు మాత్రమే గమనిస్తానని చెప్పుకొచ్చింది. అనుష్క, సాయి పల్లవి తన ఫేవరేట్ హీరోయిన్స్ అని తెలిపింది.

తన ఫస్ట్ పారితోషికం రూ.3 వేలు అని.. తనను సహజనటి జయసుధతో చిరంజీవి పోల్చడం జీవితంలో మర్చిపోలేని ప్రశంస అని తెలిపింది. బేబీ సినిమా తర్వాత అభిమానుల నుంచి చాలా ప్రపోజల్స్ వచ్చాయని చెప్పుకొచ్చింది.





























