- Telugu News Photo Gallery Cinema photos Prabhas gave a second chance to that director to make a film in the action genre
Prabhas: ఆ దర్శకుడికి సెకండ్ ఛాన్స్ ఇచ్చిన డార్లింగ్.. యాక్షన్ జానర్‌లో..
ప్రభాస్ కెరీర్‌లో దర్శకులను రిపీట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. పాన్ ఇండియా హీరో అయ్యాక ఒక సినిమా చేసిన దర్శకుడితో మరో సినిమా ఇంత వరకు చేయలేదు. ఈ టైమ్‌లో ఓ దర్శకుడికి సెకండ్ ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్. మరి ఆ దర్శకుడు ఎవరు.? అయన డార్లింగ్‌ని ఎలా ఇంప్రెస్స్ చేసారు.? ఈరోజు మన తెలుసుకుందాం..
Updated on: Apr 06, 2025 | 3:05 PM

ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమా దర్శకుడితో మరో మూవీ చేయబోతున్నారు మనందరి డార్లింగ్ ప్రభాస్. అది కూడా ఆ దర్శకుడికి అస్సలు పరిచయం లేని జానర్‌లో కావటం మరింత ఆసక్తికరంగా మారింది.

ప్రజెంట్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. రెండో ప్రపంచ యుద్దం కాలం నాటి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లోనే హనుకి మరో బంపర్ ఆఫర్ ఇచ్చారట డార్లింగ్.

ఫౌజీ కోసం షూట్ చేసిన ఓ యాక్షన్ ఎపిసోడ్ చూసి ఇంప్రెస్ అయిన ప్రభాస్, హను దర్శకత్వంలో ఓ పూర్తిస్థాయి యాక్షన్ మూవీ చేద్దామని చెప్పారట. కథ రెడీ చేస్తే వెంటనే ఆ సినిమాను పట్టాలెక్కిద్దామని చెప్పటంతో ఫౌజీ షూటింగ్‌తో పాటు నెక్ట్స్ మూవీకి కథను సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారు హను.

హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్ తెరకెక్కించే హను పూర్తి యాక్షన్ సినిమాను ఎలా డీల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో స్పై జానర్‌లో లై సినిమాను ట్రై చేశారు హను. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినా... కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. అందుకే తరువాత మళ్లీ యాక్షన్ జానర్‌ను టచ్ చేయలేదు హను.

ఇప్పుడు ప్రభాస్ స్వయంగా కోరటంతో మరోసారి ఆ రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు హను రాఘవపూడి. మరి ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గ యాక్షన్ కథను హను సిద్ధం చేస్తారా..? చేస్తే ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది? ఈ విషయాల్లో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.





























