- Telugu News Photo Gallery Cinema photos Ajith Kumar Good Bad Ugly to Rajinikanth Coolie latest film updates from industry
Tollywood Updates: గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ రిలీజ్.. ఆ రోజునే కూలీ విడుదల..
అజిత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ కూలీ. బాక్సాఫీస్ దగ్గర ఎల్ 2 ఎంపురాన్ జోరు కంటిన్యూ అవుతోంది. ధనుష్ స్యయంగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇడ్లీ కడై. అవతార్ 3కి సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు దర్శకుడు జేమ్స్ కామెరూన్.
Updated on: Apr 06, 2025 | 1:59 PM

అజిత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ఏప్రిల్ 10న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నారు.

రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ కూలీ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

బాక్సాఫీస్ దగ్గర ఎల్ 2 ఎంపురాన్ జోరు కంటిన్యూ అవుతోంది. తాజాగా ఈ సినిమా 250 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. ఓ వైపు వివాదాలు ఇబ్బంది పెడుతున్నా.. వసూళ్లు మాత్రం తగ్గటం లేదు. మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాను తెరకెక్కించారు. గతంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్‌కు కొనసాగింపుగా రూపొందింది ఎల్ 2 ఎంపురాన్.

ధనుష్ స్యయంగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇడ్లీ కడై. విలేజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఇడ్లీ కడై మూవీని ఆరునెలలు ఆలస్యంగా అక్టోబర్ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్. ఆకాష్ భాస్కరన్‌తో కలిసి ధనుష్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అవతార్ 3కి సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. తొలి రెండు భాగాల్లో హీరో మానవులతోనే పోరాడాడు, కానీ పార్ట్ 3లో కొత్త విలన్లు పుట్టుకొస్తారని చెప్పారు. పార్ట్ 3 కథ చంద్రుడి మీద జరుగుతుందని రివీల్ చేశారు. ఈ సారి యాష్ తెగలతో జేక్ పోరాడబోతున్నాడన్నారు జేమ్స్.




